- Telugu News Photo Gallery Technology photos Spy camera detector under 3000 features amazon flipkart discount
Spy Camera Detectors: రూమ్‌లలో సిక్రెట్ కెమెరాలను గుర్తించాలా? తక్కువ ధరల్లోనే కెమెరా డిటెక్టర్స్
స్పై కెమెరాలకు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. అయినప్పటికీ స్పై కెమెరాలు తరచుగా దుర్వినియోగం అవుతున్నాయి. ఫలితంగా చాలా మంది వ్యక్తుల గోప్యతకు భంగం కలుగుతుంది. బాలికల వాష్‌రూమ్‌లో స్పై కెమెరా దొరికిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. స్పై కెమెరాలు చాలా చిన్న పరికరం. వీటిని ఎక్కడైనా సులభంగా ఉంచవచ్చు. మీ వాష్‌రూమ్, రూమ్ లేదా ఇంట్లో ఏదైనా స్పై కెమెరా ఇన్‌స్టాల్ చేయబడిందో లేదో కూడా మీరు సులభంగా తెలుసుకోవచ్చు..
Updated on: Sep 11, 2024 | 12:52 PM

Spy Camera Detector: ఈ గాడ్జెట్ కెమెరాలను గుర్తించడమే కాకుండా, హోటల్ లేదా ఆఫీసులో ఎక్కడైనా దాచిన జీపీఎస్, బగ్ డిటెక్టర్, ప్రైవసీ ప్రొటెక్టర్, ఆర్‌ఎఫ్ వైర్‌లెస్ సిగ్నల్‌లను స్కాన్ చేయగలదు. దీని ధర రూ. 6,999 అయినప్పటికీ, మీరు అమెజాన్ నుండి 57 శాతం తగ్గింపుతో కేవలం రూ. 2,999కి కొనుగోలు చేయవచ్చు.

MatLogix K18: దాచిన కెమెరాలు, బగ్ ఫైండర్, జీపీఎస్ ట్రాకర్, కెమెరాలను కనుగొనడంలో సహాయకరంగా ఉంటుంది. మీరు దీన్ని కేవలం రూ. 3,599కి తగ్గింపుతో పొందుతున్నారు.

హిడెన్ కెమెరా డిటెక్టర్లు: రహస్య కెమెరా డిటెక్టర్ ధర రూ. 3,573, మీరు దీన్ని ఏదైనా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీరు చాలా ఫీచర్లను ఉంటాయి.

సిక్రెట్ కెమెరా డిటెక్టర్లు: ఈ సిక్రెట్ కెమెరా మీ భద్రత కోసం మెరుగైన ఉత్పత్తిగా ఉపయోగపడుతుంది. ఇందులో మీరు 4 మోడ్‌లు, 5 సున్నితత్వ స్థాయిలను పొందుతారు. మీరు దీన్ని అమెజాన్ నుండి రూ. 5,532కి కొనుగోలు చేయవచ్చు.

Skypearll Hidden Camera Detector: ఈ కెమెరా డిటెక్టర్ సాధారణ కెమెరా డిటెక్టర్లు చేసే అన్ని పనులను కూడా ఇది చేయగలదు. అయితే ఇందులోని ఒక ఉత్తమమైన ఫీచర్ ఏమిటంటే, ఫ్లాష్‌తో కూడిన పర్సనల్ సేఫ్టీ సౌండ్ అలారం ఉంది. ఇది ఆన్‌లైన్ డిస్కౌంట్‌తో రూ.1,199కి లభిస్తుంది. (నోట్: ఈ డిటెక్టర్ల ధరలు కాలానుగుణంగా మార్పులు ఉండవచ్చని గమనించండి.)




