- Telugu News Photo Gallery Technology photos Amazon electronics festive sale huge discount on xiaomi 43 inch smart tv
Xiaomi 43 inches: 43 ఇంచెస్ టీవీపై రూ. 20 వేల డిస్కౌంట్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ ఫెస్టివ్ సేల్ పేరుతో సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కైంట్స్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు మొదలు టీవీల వరకు భారీ ఆఫర్స్ అందించారు. ఇందులో భాగంగానే లభిస్తోన్న బెస్ట్ డీల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 10, 2024 | 10:04 PM

షావోమీకి చెందిన 43 ఇంచెస్ టీవీపై అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ఫెస్టివ్ సేల్‌లో మంచి డీల్ లభిస్తోంది. షావోమీ 43 ఇంచెస్‌తో ప్రో 4కే డాల్బీ విజన్ ఫోన్‌పై అమెజాన్‌లో ఏకంగా రూ. 20 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు.

ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 42,999కాగా ప్రస్తుతం 37 శాతం డిస్కౌంట్‌తో రూ. 26,999కి లభిస్తోంది. అయిలతే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 2500 వరకు తగ్గింపు ధరకు లభిస్తోంది. దీంతో ఈ టీవీని రూ. 24 వేలకే సొంతం చేసుకోవచ్చు.

ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4కే అల్ట్రా హెచ్‌డీ రిఫ్రెష్ రేట్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. డాల్బీ ఆడియోకు సపోర్ట్ చేసే ఈ టవీలో 30 వాట్స్ అవుట్‌పుట్‌ను ఇచ్చారు. ఈ టీవీలో 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు.

కంపెనీ ఈ టీవీపై ఏడాది వారంటీ అందిస్తోంది. ఈ టీవీ గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే అన్ని రకాల ఆండ్రాయిడ్ యాప్స్‌కు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. టీవీ రిమోట్ బ్లూటూత్‌లో కంట్రోల్ చేసుకోవచ్చు.

వైఫై, యూఎస్‌బీ, ఇథర్‌నెట్, హెచ్‌డీఎమ్‌ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. 60 హెచ్‌జెడ్ రిఫ్రెట్ రేట్ ఈ టీవీ స్క్రీన్ సొంతం. ఇక ఈ టీవీ బరువు 6 కిలోలుగా ఉంది.




