AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రిజ్‌ లో ఉంచకూడని 5 పదార్థాలు.. ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!

ఫ్రిజ్‌ లో అన్నీ సురక్షితంగా ఉంటాయని అనుకోవడం ఒక పెద్ద పొరపాటు. కొన్ని ఆహార పదార్థాల ను ఫ్రిజ్‌ లో పెడితే వాటి పోషక విలువలు తగ్గిపోవడమే కాకుండా.. అవి ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రిజ్‌ లో ఉంచకూడని 5 పదార్థాలు.. ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!
Fridge
Prashanthi V
|

Updated on: Aug 24, 2025 | 11:19 PM

Share

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాలు పెట్టకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ప్రతి వస్తువును ఫ్రిజ్‌లో పెడుతూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల వాటి పోషక విలువలు తగ్గిపోవడమే కాకుండా.. ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్లాస్టిక్ బాటిల్స్

చాలా మంది నీళ్ళు, పచ్చళ్ళు, ఇతర డ్రింక్స్ లను ప్లాస్టిక్ బాటిల్స్‌లో పెడతారు. కానీ చల్లని వాతావరణంలో ప్లాస్టిక్ నుంచి హానికరమైన రసాయనాలు బయటకు వస్తాయి. దీని వల్ల నీరు లేదా ఆహారం కలుషితం అవుతుంది. ప్లాస్టిక్‌కు బదులు గాజు సీసాలు వాడటం మంచిది.

తేనె

తేనెను ఫ్రిజ్‌లో పెడితే అది గట్టిపడి దాని రుచి, పోషక గుణాలు పోతాయి. అందుకే తేనెను గది ఉష్ణోగ్రతలోనే గట్టిగా మూత పెట్టి ఉంచాలి.

బంగాళాదుంప

బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో పెడితే దానిలోని స్టార్చ్ చక్కెరగా మారుతుంది. తర్వాత వాటిని వండినప్పుడు ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు ఏర్పడతాయి. బంగాళాదుంపలను చల్లని, పొడి ప్రదేశంలో ఉంచాలి.

నెయ్యి

నెయ్యిని ఫ్రిజ్‌లో పెడితే అది గట్టిపడుతుంది. తర్వాత దాన్ని వాడాలంటే మళ్ళీ వేడి చేయాల్సి వస్తుంది. ఇలా మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల నెయ్యి రుచి, వాసన మారిపోతాయి. నెయ్యిని ఎప్పుడూ గది ఉష్ణోగ్రతలో గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి.

పిండి

పిండిని కలిపి ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది కాదు. అలా చేయడం వల్ల అది పులిసి, దానిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. ఈ పిండితో చేసిన చపాతీలు తింటే కడుపు నొప్పి, గ్యాస్ లాంటి సమస్యలు రావచ్చు. ప్రతిసారీ తాజా పిండిని కలపడం ఆరోగ్యానికి మంచిది.

ఫ్రిజ్‌లో పెడితే అన్నీ సురక్షితం అనుకోవడం తప్పు. పైన చెప్పిన పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టకుండా జాగ్రత్త పడండి. లేకపోతే ఆరోగ్యానికి ముప్పు తప్పదు.