AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగినర్స్ కోసం బెస్ట్ రన్నింగ్ గైడ్.. ఈ సింపుల్ టిప్స్ తో ఫిట్నెస్ ఛాలెంజ్ పూర్తి చేయండి..!

కొత్తగా పరుగు మొదలు పెట్టేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడ మొదలు పెట్టాలి, శ్వాస ఎలా తీసుకోవాలి, ఎలాంటి బూట్లు వేసుకోవాలి వంటి ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు ఉన్నాయి. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే 5 కిలోమీటర్లు పరిగెత్తడం మీకు చాలా సులభం అవుతుంది. ఈ చిట్కాలతో ఆరోగ్యం, ఫిట్‌నెస్ రెండూ మీ సొంతం.

బిగినర్స్ కోసం బెస్ట్ రన్నింగ్ గైడ్.. ఈ సింపుల్ టిప్స్ తో ఫిట్నెస్ ఛాలెంజ్ పూర్తి చేయండి..!
Running For Beginners
Prashanthi V
|

Updated on: Aug 24, 2025 | 11:03 PM

Share

కొత్తగా పరుగు మొదలు పెట్టేవారికి కొన్ని సింపుల్, సూపర్ టిప్స్ ఇక్కడ ఉన్నాయి. వీటిని ఫాలో అయితే 5 కి.మీ పరుగు కూడా మీకు చాలా ఈజీగా మారుతుంది. పరుగులో చాలా రకాలున్నాయి. నెమ్మదిగా జాగింగ్, వేగంగా పరుగెత్తడం, వెనుకకు పరుగెత్తడం లాంటివి. ఒక్కో పద్ధతికి ఒక్కో లాభం ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకు జాగింగ్ చాలా మంచిది. దీని వల్ల బాడీలోని కేలరీలు ఫాస్ట్‌గా కరిగిపోతాయి. ఫిట్‌నెస్‌ పెరిగి, బాడీలోని టాక్సిన్స్ బయటకు వెళ్తాయి.

శ్వాస ఎలా తీసుకోవాలి..?

పరుగులో శ్వాస చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ముక్కుతో తీసుకోవాలా, నోటితో తీసుకోవాలా అనే డౌట్ ఉంటుంది. తక్కువ దూరం లేదా ఫాస్ట్‌గా పరిగెత్తేటప్పుడు ముక్కు, నోటి ద్వారా కూడా శ్వాస తీసుకోవచ్చు. దీని వల్ల కండరాలకు సరిపడా ఆక్సిజన్ అందుతుంది. కానీ ఎక్కువ దూరం (5 నుంచి 10 కి.మీ) పరిగెత్తేటప్పుడు ఎక్కువగా ముక్కుతోనే శ్వాస తీసుకోవడం బెస్ట్. అవసరమైతే అప్పుడప్పుడు నోటి ద్వారా కూడా తీసుకోవచ్చు.

వారంలో ఎన్ని రోజులు పరుగెత్తాలి..?

రోజు పరుగెత్తాల్సిన పని లేదు. వారానికి 3 నుంచి 5 రోజులు చాలు. రోజుకు ఒక గంట కష్టపడాల్సిన అవసరం లేదు. 20 నుంచి 30 నిమిషాల నెమ్మదిగా జాగింగ్ సరిపోతుంది. శక్తి ఉంటే మధ్యలో కొన్ని సార్లు ఫాస్ట్‌ గా పరుగెత్తవచ్చు.

కొత్తవారికి ముఖ్యమైన టిప్స్

  • మొదటి రోజే 5 కి.మీ టార్గెట్ పెట్టుకోవద్దు. ముందు 500 మీటర్లు లేదా 1 కి.మీ పరుగుతో మొదలుపెట్టి.. తర్వాత దూరం పెంచుకోండి.
  • మొదట్లో 15 నుంచి 20 నిమిషాల జాగింగ్ సరిపోతుంది. ఇలా అలవాటు చేసుకుంటూ వెళ్తే రోజు రోజుకు దూరం పెంచుకోవడం ఈజీ అవుతుంది.

స్టార్టింగ్‌లో 20 నిమిషాల షెడ్యూల్ పెట్టుకుంటే.. మొదటి 4 నిమిషాలు నెమ్మదిగా పరుగెత్తి, తర్వాత 1 నిమిషం నడవండి. ఇలా చేయడం వల్ల మీ బాడీ పరుగుకు అలవాటు పడుతుంది. స్టామినా పెరిగినప్పుడు నడక సమయాన్ని తగ్గించి పూర్తిగా జాగింగ్ చేయవచ్చు.

సరైన షూస్

పరుగుకు స్పెషల్ ఎక్విప్‌మెంట్స్ అవసరం లేకపోయినా.. మంచి క్వాలిటీ ఉన్న షూస్ మాత్రం తప్పకుండా ఉండాలి. ఇవి గాయాలు, పాదాల నొప్పి, ఎముకల సమస్యల నుంచి మనల్ని కాపాడతాయి.

దుస్తులు ఎలా ఉండాలి..?

పరిగెత్తేటప్పుడు చెమటను పీల్చుకునేలా మృదువైన, సౌకర్యవంతమైన దుస్తులు వేసుకోవాలి. 

పాదాల నొప్పి, చిన్న గాయాలు..

స్టార్టింగ్ లో పాదాల నొప్పి, పుండ్లు రావడం కామనే. అవి మెల్లగా తగ్గిపోతాయి. అందుకే పరుగును ఆపకండి. పరుగు ముందు వార్మప్, తర్వాత కూల్‌ డౌన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.

5 కి.మీ ఈజీగా చేరాలంటే..

మొదట ఐదు నిమిషాల జాగింగ్, ఒక నిమిషం నడకతో మొదలుపెట్టండి. అలవాటయ్యాక పరుగును 10 నిమిషాలకు పెంచి.. నడకను 30 సెకన్లకు తగ్గించండి. ఇది మీ కాళ్ల బలాన్ని పెంచుతుంది. చివరికి మీరు సులభంగా 5 కి.మీ పరుగెత్తగలుగుతారు.

ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ క్రమంగా ముందుకు సాగితే 5 కిలోమీటర్లు కాదు.. అంతకంటే ఎక్కువ దూరం కూడా మీరు సులభంగా పరిగెత్తగలుగుతారు. పరుగు అనేది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)