మార్నింగ్ టిఫిన్ చేయడం మానేశారా.. అయితే ఈ సమస్యలు తప్పవు!
ప్రస్తుత కాలంలో చాలా మంది టిఫిన్ చేయడం మానేస్తున్నారు. వర్క్ బిజీ లేదా త్వరగా ఆఫీసుకు వెళ్లాలనే ఆరాటంలో అల్పాహారం దాటవేస్తారు. ఇంకొంత మంది బరువు తగ్గాలని టిఫిన్ మానేస్తారు. కానీ ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన డయాబెటీస్, ఊబకాయం వంటి తీవ్ర సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన్నదంట. కాగా, ఇప్పుడు అల్పాహారం ఎందుకు తీసుకోవాలి? తీసుకోకపోవడం వలన ఎలాంటి నష్టాలు కలుగుతాయో చూద్దాం.
Updated on: Aug 25, 2025 | 10:01 AM

రాత్రంతా నిద్రపోయి ఏమీ తినకుండా ఉండి,ఉదయం లేచిన తర్వాత శరీరానికి శక్త అసరం అవుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడానికి తప్పకుండా ఉదయం అల్పాహారం తీసుకోవాలి. ఎందుకంటే? మార్నింట్ టిఫిన్ చేయడం వలన శరీరం ఇంధనంగా పనిచేయడమే కాకుండా ఆరోగ్యం బాగుంటుందంట.

ఇక కొంత మంది రోజూ ఉదయం టిఫిన్ చేయడం మానేస్తుంటారు. అయితే అలాంటి వారు త్వరగా డయాబెటీస్ బారిన పడే ప్రమాదం ఉంటుందంట. ఉదయం అల్పాహారం దాటేసే వారిలో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం 30 శాతం ఉంటుందని, ఇలా టిఫిన్ దాట వేయడం వలన శరీరానికి తక్షణ శక్తి లభించక, ఇది ఇన్సులిన్ నిరోధకతను సృష్టిస్తుందంట.

అలాగే కొందరు బరువు తగ్గడానికి టిఫిన్ మానేస్తుంటారు. కానీ టిఫిన్ మానెయ్యడం వలన అధిక బరువు పెరుగుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుంకటే? ఉదయం టిఫిన్ చేయకపోవడం వలన ఆకలి పెరిగి, రోజులో ఎక్కువ సార్లు ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవాలనే కోరిక కలుగుతుందంట. అలా అతిగా తినడం వలన క్రమంగా బరువు పెరుగుతారంట.

అదే విధంగా టిఫిన్ దాటవేయడం వలన జీర్ణక్రియపై చాలా ప్రభావం పడుతుందంట. దీని వలన జీర్ణక్రియ మందగించి, అది శరీరంలోని కేలరీలను సరిగా బర్న్ చేయలేదంట. దీంతో త్వరగా బరువు పెరగడం, అలసట వంటి సమస్యలు వస్తాయంట.

రోజూ ఉదయం టిఫిన్ చేయకపోవడం వలన ఇది శారీరక ఆరోగ్యంపైనే కాకుండా, మానసిక ఆరోగ్యంపై కూడా చాలా చెడు ప్రభావం చూపిస్తుందంట. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి, ఇది చిరాకు, ఒత్తిడి,దృష్టి పెట్టడంలో ఇబ్బంది వంటి సమస్యలకు దారితీస్తుంది. పిల్లలు మరియు విద్యార్థులు చదువులు , పనిపై బాగా దృష్టి పెట్టడానికి అల్పాహారం చాలా ముఖ్యమైనది.



