Coffee: కాఫీ ఈ ఆహారాలతో తీసుకోవడం విషంతో సమానం.. ఎందుకంటే?
కాఫీ.. ఇది లేనిదే ఎంతో మందికి రోజు ప్రారంభంకాదు. అయితే దీన్ని కొన్ని ఆహారాలతో పాటు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం కాఫీ తీసుకునే సమయంలో ముఖ్యంగా 5 ఆహారాలకు దూరంగా ఉండాలి. ఫలితంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఉదయాన్నే ఘుమ ఘుమలాడే కప్పు కాఫీ తాగితే ఆ మజానే వేరు..

కాఫీ.. ఇది లేనిదే ఎంతో మందికి రోజు ప్రారంభంకాదు. అయితే దీన్ని కొన్ని ఆహారాలతో పాటు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం కాఫీ తీసుకునే సమయంలో ముఖ్యంగా 5 ఆహారాలకు దూరంగా ఉండాలి. ఫలితంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఉదయాన్నే ఘుమ ఘుమలాడే కప్పు కాఫీ తాగితే ఆ మజానే వేరు. అయితే కొంతమంది రోజు మొత్తంలో పని సమయంలో అలసట నుంచి ఉపశమనం పొందడానికి కాఫీ అపరిమితంగా తాగుతుంటారు. ఇలా లెక్కకుమించి కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాఫీలో సహజంగానే ఆమ్లాలు, ఉత్తేజకాలు ఉంటాయి. అందువల్ల కొన్ని ఆహారాలతో కలిపి కాఫీ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ రుగ్మతల నుంచి గుండె సమస్యల వరకు అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుంది. అందువల్ల కాఫీతో ఈ 5 ఆహారాలు తినకుండా ఉండటం చాలా ముఖ్యం. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
నారింజ, నిమ్మకాయలు వంటి పుల్లని ఆహార పదార్థాలను కాఫీతో కలిపి తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. ఇది గుండెల్లో మంట, త్రేనుపు సమస్యను పెంచుతుంది. అందువల్ల ఈ కలయిక మరింత హానికరం కావచ్చు. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, డోనట్స్, వేయించిన మాంసాలలో కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. కాఫీ ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
కాఫీతో పాటు పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించకుండా నిరోధించవచ్చు. దీర్ఘకాలంలో ఇది ఎముకలపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. కాఫీ తాగడం వల్ల కొంతమందిలో రక్తపోటు పెరుగుతుంది. అల్పాహారంలో ఉప్పగా ఉండే ఆహారాన్ని చేర్చడం వల్ల రక్తపోటుపై మరింత చెడు ప్రభావాలు ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది ప్రమాదకరం. అలాగే కేకులు లేదా తీపి డోనట్స్ వంటి అధిక చక్కెర కలిగిన తీపి ఆహారాలను కాఫీతో పాటు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి, ఆపై వేగంగా పడిపోతాయి. దీని వలన మీకు అలసిపోయినట్లు అనిపించవచ్చు. అనంతరం నీరసంగా, చిరాకుగా కూడా అనిపిస్తుంది. అందువల్ల కాఫీ తాగేముందు, ఆ తర్వాత ఈ ఆహారాలు తీసుకోకపోవడమే మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








