AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవి సెలవుల్లో పిల్లల అల్లరి తట్టుకోలేకపోతున్నారా..అయితే ఈ టిప్స్ పాటించి చూడండి..

వేసవికాలం వచ్చేసింది మీ పిల్లలు ఇంటి వద్ద మీతో పాటు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో నెల రోజుల పాటు పిల్లల స్కూలు తెరిచే వరకు తల్లిదండ్రుల వద్ద పిల్లలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వేసవి సెలవుల్లో పిల్లల అల్లరి తట్టుకోలేకపోతున్నారా..అయితే ఈ టిప్స్ పాటించి చూడండి..
Parenting
Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 27, 2023 | 7:00 AM

Share

వేసవికాలం వచ్చేసింది మీ పిల్లలు ఇంటి వద్ద మీతో పాటు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో నెల రోజుల పాటు పిల్లల స్కూలు తెరిచే వరకు తల్లిదండ్రుల వద్ద పిల్లలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వేసవికాలంలో పిల్లలు ఇంటి వద్ద ఉండటంతో ముఖ్యంగా తల్లులకు పెద్ద సవాలే చెప్పాలి. ఎందుకంటే పిల్లలకు రోజంతా బోర్ కొట్టకుండా, అదే పనిగా వారు ఎండలో ఆడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లులపై ఉంటుంది. అయితే వారు రోజంతా ఇంట్లో ఉండే అల్లరి చేయడం వల్ల తల్లులకు అసహనం వచ్చే అవకాశం ఉంది. అందుకే పిల్లలతో మీరు ఈ సమ్మర్ సీజన్ ఎలా గడపాలో ఆ సహనం తెచ్చుకోకుండా పిల్లలను ఎలా మందలించాలో తీసుకుందాం.

పిల్లలు ఆడుకోవడానికి సమయం నిర్ణయించండి..వేసవికాలంలో పిల్లలు ఆడుకునేందుకు నిర్దిష్టమైన టైం టేబుల్ ను రూపొందించండి. అప్పుడు పిల్లలు టైం టేబుల్ ప్రకారం ఆడుకునే వీలుంది. అదే పనిగా ఎండల్లో ఆడుకోకుండా నీడ పట్టునే ఉంటారు. ముఖ్యంగా పిల్లలు టీవీ చూడకుండా వారిని ఫిజికల్ గేమ్స్ వైపు మోటివేట్ చేస్తే మంచిది. అదేవిధంగా సాయంకాలం పూట పిల్లలకు కరాటే, డ్రాయింగ్, స్విమ్మింగ్, క్రికెట్, చెస్, వంటి యాక్టివిటీస్ లో శిక్షణ ఇప్పించడం వల్ల వారు బోర్ ఫీల్ అవ్వరు.

పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకండి:

ఇవి కూడా చదవండి

వేసవికాలంలో పిల్లలు అల్లరి చేస్తున్నారని వారికి మీ స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఆరోగ్యాన్ని పాడు చేయకండి. అదేపనిగా స్మార్ట్ఫోన్ చూసినట్లయితే పిల్లలకు దృష్టిలోపం కలిగే అవకాశం ఉంది. అందుకే పిల్లలకు మొబైల్ ఫోన్ బదులు మంచి కథల పుస్తకాలు డ్రాయింగ్ పుస్తకాలు కొనివ్వండి. అలాగే వారిలో సృజనాత్మకతను వెలికి తీసేలా వారితో బొమ్మలు వేయించండి. లేదా ఇతర కళలను నేర్పించండి. అంతే తప్ప స్మార్ట్ ఫోన్ ఇచ్చి వారి భవిష్యత్తును పాడు చేయకండి.

వేసవి సెలవుల్లో పల్లెటూర్లకు తీసుకువెళ్లండి:

మూలాలు పల్లెటూర్లలో ఉన్నట్లయితే వేసవి సెలవుల్లో పిల్లలను వారి అమ్మమ్మ లేదా నాయనమ్మ ఇంటికి పంపించేందుకు ప్రయత్నించండి. సిటీలోని కాలుష్యానికి దూరంగా పిల్లలు పల్లెటూరి వాతావరణం లో హాయిగా పెరుగుతారు వారికి అనేక విషయాలు తెలుస్తాయి ముఖ్యంగా వ్యవసాయ పద్ధతులు ఆచార వ్యవహారాలు మన సంస్కృతి పిల్లలకు తెలిసే ఉంటుంది.

పిల్లలపై కోపం తెచ్చుకోవద్దు:

వేసవి సెలవుల్లో పిల్లలు బోర్ కొడుతుందని అల్లరి చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు అల్లరి చేస్తున్నారు కదా అని మీరు వారిపై అదే పనిగా సహాయం తెచ్చుకోవద్దు. వారికి అర్థమయ్యే విధంగా చెప్పి చూడండి. లేదా వారిని ఏదైనా యాక్టివిటీలో బిజీగా ఉండేలా చూడండి. అలాగే రోజుల్లో కొద్ది సమయం పిల్లలకు కేటాయించి వారితో ముచ్చటించండి. అలాగే పిల్లలకు నచ్చిన ఫుడ్ ను తయారు చేసి తినిపించండి. అలాగే పిల్లలతో గార్డెనింగ్ చేయించడం ద్వారా వారి అల్లరిని కట్టిపెట్టవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..