AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లో బొద్దింకలతో విసిగెత్తిపోయారా? ఈ చిన్న ట్రిక్‌తో చిటికెలో తరిమేయండి

ఎక్కడ తేమ, ఆహార వాసన ఉంటుందో అక్కడ బొద్దింకలు తమ నివాసంగా మారడానికి ఇష్టపడతాయి. మార్కెట్లో వివిధ స్ప్రేలు, రసాయనాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి ఎంతో ఖరీదైనవి. పైగా వీటిని వాడటం వల్ల కుటుంబంలోని పిల్లలు, పెంపుడు జంతువులకు కూడా హానికరం కావచ్చు. వీటిని సులువుగా తరిమికొట్టాలంటే..

మీ ఇంట్లో బొద్దింకలతో విసిగెత్తిపోయారా? ఈ చిన్న ట్రిక్‌తో చిటికెలో తరిమేయండి
cockroaches
Srilakshmi C
|

Updated on: Sep 13, 2025 | 1:24 PM

Share

కిచెన్‌ నుంచి బాత్రూమ్, అల్మారా, చివరకు బెడ్‌ రూంలో కూడా ఎక్కడ పడితే అక్కడ బొద్దింకలు దర్శనమిస్తూ ఉంటాయి. నిజానికి.. ఎక్కడ తేమ, ఆహార వాసన ఉంటుందో అక్కడ బొద్దింకలు తమ నివాసంగా మారడానికి ఇష్టపడతాయి. మార్కెట్లో వివిధ స్ప్రేలు, రసాయనాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి ఎంతో ఖరీదైనవి. పైగా వీటిని వాడటం వల్ల కుటుంబంలోని పిల్లలు, పెంపుడు జంతువులకు కూడా హానికరం కావచ్చు. అయితే ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లోనే సహాజ పద్ధతుల్లో బొద్దింకలకు చెక్‌ పెట్టొచ్చు. ఎలాగంటే..

బేకింగ్ సోడా – చక్కెర

బేకింగ్ సోడా – చక్కెరను సమాన పరిమాణంలో కలిపి ఒక మూలలో ఉంచాలి. చక్కెర ఈగలను ఆకర్షిస్తుంది. బేకింగ్ సోడా విషంగా పనిచేస్తుంది.

లవంగాల వాసన

వంటగది డ్రాయర్లు, అల్మారాలు, పప్పు డబ్బాలలో కొన్ని లవంగాలను ఉంచాలి. బొద్దింకలు లవంగాల వాసనను తట్టుకోలేవు.

ఇవి కూడా చదవండి

వేప ఆకులు లేదా వేప నూనె

వేప ఆకులను నీటితో కలిపి పిచికారీ చేయడం లేదా కొన్ని చుక్కల వేప నూనెను నేలపై రుద్దడం వల్ల కూడా బొద్దింకలు దూరంగా ఉంటాయి.

దోసకాయ తొక్క

తాజా దోసకాయ తొక్కలు బొద్దింకలకు ఇష్టం ఉండవు. ఆ తొక్కలను వంటగది సింక్ లేదా మూలలో వదిలేస్తే అవి పారిపోతాయి.

బోరిక్ పౌడర్

రాత్రిపూట నేలపై కొంత బోరిక్ పౌడర్ చల్లి ఉంచాలి. కానీ పిల్లలు, పెంపుడు జంతువులకు అందుబాటులో లేకుండా జాగ్రత్తగా ఉంచాలన్న విషయం మర్చిపోకూడదు.

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, మురికి పాత్రలను ఉంచకుండా ఉండటం, మురుగు కాలువలను కప్పి ఉంచడం వల్ల బొద్దింకల సమస్య తలెత్తదు. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల బొద్దింకల బెడద చాలా వరకు తగ్గుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..