పన్నీర్ తింటే కొవ్వు పట్టదట..!
పన్నీర్.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పన్నీర్ కర్రీ అంటేనే.. నోరూరుతుంది. ప్రాచీనకాలం నుంచి పన్నీర్ వంటకాలు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ దీనిని రోజులో ఒక భాగం చేసుకుంటారు. మనం వాడే ప్రతీ ఆహార పదార్థానికి రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు.. అపోహలు కూడా ఉంటాయి. పన్నీర్ తింటే చాలా మందికి ఫాక్ట్ అయిపోతాం అని దానిని తినరు. నిజానికి.. పన్నీర్ తింటే కొవ్వు కరుగుతుందట. కాగా.. రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. అంతేగాక.. కండరాలు, […]
పన్నీర్.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పన్నీర్ కర్రీ అంటేనే.. నోరూరుతుంది. ప్రాచీనకాలం నుంచి పన్నీర్ వంటకాలు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ దీనిని రోజులో ఒక భాగం చేసుకుంటారు. మనం వాడే ప్రతీ ఆహార పదార్థానికి రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు.. అపోహలు కూడా ఉంటాయి. పన్నీర్ తింటే చాలా మందికి ఫాక్ట్ అయిపోతాం అని దానిని తినరు. నిజానికి.. పన్నీర్ తింటే కొవ్వు కరుగుతుందట. కాగా.. రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. అంతేగాక.. కండరాలు, నాడుల పనితీరును నిర్వహిస్తుంది. దీంతో.. మరిన్ని ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందామా..!
1. పన్నీర్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే.. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది 2. ఎర్ర రక్తకణాల అభివృద్ధికి సహకరిస్తుంది 3. మధుమేహం రాకుండా నిరోధిస్తుంది 4. పన్నీర్‌తో ఎముకలు, దంతాలు ధృఢంగా ఉంటాయి 5. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది 6. గర్భంలోని పిండాభివృద్ధికి సహకరిస్తుంది 7. రొమ్ము క్యాన్సర్‌ను నివారిస్తుంది 8. వెన్నునొప్పి, కీళ్ల బాధల్ని తగ్గిస్తుంది