AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ivy Gourd: దొండకాయల్ని తేలిగ్గా తీసి పారేస్తున్నారా.. వీటితో ఎన్నో బెనిఫిట్సో..

దొండకాయలు ఇవి కూడా కూరగాయల్లో ఒకటి. వీటి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. చాలా మందికి ఈ కూరగాయలు తెలుసు. కానీ వీటిని అస్సలు ఎవరూ ఇష్టపడరు. వీటితో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచికరంగా ఉంటాయి. కానీ ఈ దొండ కాయల్ని చాలా మంది అంతగా పట్టించుకోరు. కానీ వీటిని తరచూ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని తరచూ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తినడానికి ఇష్టం లేని వారు..

Ivy Gourd: దొండకాయల్ని తేలిగ్గా తీసి పారేస్తున్నారా.. వీటితో ఎన్నో బెనిఫిట్సో..
Ivy Gourds
Chinni Enni
|

Updated on: Mar 01, 2024 | 4:35 PM

Share

దొండకాయలు ఇవి కూడా కూరగాయల్లో ఒకటి. వీటి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. చాలా మందికి ఈ కూరగాయలు తెలుసు. కానీ వీటిని అస్సలు ఎవరూ ఇష్టపడరు. వీటితో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచికరంగా ఉంటాయి. కానీ ఈ దొండ కాయల్ని చాలా మంది అంతగా పట్టించుకోరు. కానీ వీటిని తరచూ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని తరచూ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తినడానికి ఇష్టం లేని వారు.. జ్యూస్ కూడా తయారు చేసుకుని తాగవచ్చు. దొండకాయల్ని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

జీర్ణ సమస్యలకు చెక్:

చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దొండకాయల్లో ముఖ్యంగా ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. మల బద్ధకం సమస్య ఉన్నారు ప్రతి రోజూ దొండకాయలు తింటే.. మంచి ఫలితం ఉంటుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

దొండకాయల్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి పెరుగుతాయి. దీని వల్ల వివిధ రకాల, వైరస్‌లు, ఇన్ ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. వ్యాధులు రాకుండా పోరాడే శక్తి కూడా లభిస్తుంది. సీజనల్ వ్యాధుల నుంచి త్వరగా బయట పడొచ్చు.

ఇవి కూడా చదవండి

రక్త హీనత సమస్య తగ్గుతుంది:

చాలా మంది ఐరన్ లోపం కారణంగా రక్త హీనత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దొండ కాయల్లో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్త హీనత సమస్య ఉన్నవారు తరచూ ఇది తింటే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. త్వరగా నీరసం, అలసట వంటివి కూడా తగ్గుతాయి.

వెయిట్ లాస్:

అధిక బరువు ఉన్నవారు దొండకాయలు తినడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి.. కొద్దిగా తిన్నా కడుపు నిండి ఫీలింగ్ ఉంటుంది. అంతే కాకుండా శరీరంలో కొవ్వును కరిగిస్తుంది దొండకాయ. కాబట్టి అధిక బరువు ఉన్నవారు దొండకాయ తింటే.. మంచి ఫలితం ఉంటుంది.

డయాబెటీస్ కంట్రోల్:

డయాబెటీస్ ఉన్నవారు దొండకాయను తినడం వల్ల మంచి రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి అదుపులో ఉంటాయి. దొండ కాయలు డయాబెటీస్ ఉన్నవారికి వరం అని చెప్పొచ్చు. అంతే కాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

ఆ సమయంలో అతడ్ని చంపేద్దామనుకున్నా.. కానీ.!
ఆ సమయంలో అతడ్ని చంపేద్దామనుకున్నా.. కానీ.!
కష్టపడ్డాడు..అనుకున్నది సాధించాడు! డెలివరీ బాయ్‌ టు బిజినెస్‌మేన్
కష్టపడ్డాడు..అనుకున్నది సాధించాడు! డెలివరీ బాయ్‌ టు బిజినెస్‌మేన్
ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం..
ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం..
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?