AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవ్వరికీ తెలియని అద్భుతమైన ఔషధ రహస్యం.. ఉదయాన్నే ఒక్క గ్లాసు తాగండి చాలు..

మెంతులు మన వంటింటి దినుసులలో దాగున్న అద్భుత ఔషధం. ఇవి ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి, తల్లిపాలు పెంచడానికి, ప్రసవాన్ని సులభతరం చేయడానికి ఉపకరిస్తాయి. అధిక కొలెస్ట్రాల్, మధుమేహం నియంత్రణకు, మలబద్ధకం, జ్వరం, గొంతునొప్పి నుండి ఉపశమనం పొందడానికి మెంతులు ఎంతగానో సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో మెంతులను చేర్చుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఎవ్వరికీ తెలియని అద్భుతమైన ఔషధ రహస్యం.. ఉదయాన్నే ఒక్క గ్లాసు తాగండి చాలు..
Fenugreek Water
Shaik Madar Saheb
|

Updated on: Feb 05, 2026 | 9:02 AM

Share

మన వంటింట్లో ప్రతిరోజు వాడే దినుసులలో మెంతులు ఒకటి.. కేవలం వంటకు రుచిని ఇవ్వడమే కాదు, మెంతులు అద్భుతమైన ఔషధ గుణాలతో నిండి ఉన్నాయని చాలామందికి తెలియదు. ఆరోగ్యానికి, ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. నిత్యం వీటిని సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఉదయాన్నే పరగడుపున మెంతుల నీరు (Fenugreek water) తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. మెంతుల నీరు.. ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, ప్రోటీన్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలతో కూడిన శక్తివంతమైన పానీయం. రాత్రి నానబెట్టిన మెంతుల నీటిని ఉదయం పరగడుపున తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.. బరువు తగ్గుదలకు సహాయపడుతుందని డైటీషియన్లు చెబుతున్నారు.

మెంతులు, మెంతుల నీటి వల్ల కలిగే లాభాలు..

మెంతులు, మెంతుల నీరు బాలింతలలో తల్లిపాలు పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. మెంతికూరను ఆహారంలో చేర్చడం లేదా మెంతులతో చేసిన దోసెలు, ఇడ్లీలు తీసుకోవడం ద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది.

గర్భధారణ సమయంలో, ప్రసవాన్ని సులభతరం చేయడానికి, గర్భాశయ సంబంధ సమస్యలను తగ్గించడానికి మెంతులు ఉపయోగపడతాయి. ప్రసవం తర్వాత పేగుల కదలికను మెరుగుపరచి, నడుము నొప్పి వంటి సమస్యలను నివారిస్తాయి.

అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు రోజుకు 10-20 గ్రాముల మెంతులను నీటిలో లేదా మజ్జిగలో కలిపి తీసుకుంటే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.

మధుమేహం నియంత్రణకు మెంతులు, మెంతుల నీరు అద్భుత ఔషధం. ప్రతిరోజూ ఒక టీస్పూన్ మెంతి పొడిని మూడు సార్లు తీసుకోవడం లేదా నానబెట్టిన మెంతులను నీటితో పాటు సేవించడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

మలబద్ధకం సమస్య ఉన్నవారు 2-3 చెంచాల నానబెట్టిన మెంతులను తింటే విరేచనం సాఫీగా అవుతుంది.

జ్వరం, గొంతునొప్పి తగ్గించడానికి మెంతులు, తేనె, నిమ్మరసం కలిపిన కషాయం ఉపశమనం ఇస్తుంది.

మెంతులను ఇలా తీసుకోండి..

ఈ విధంగా మెంతులు మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటిని సరైన రీతిలో ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. ఆరోగ్యకరమైన జీవనం కోసం మెంతులను మీ దినచర్యలో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.. ముందుగా రాత్రి పూట మెంతులను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడంతోపాటు.. తినవచ్చు.. లేదా మెంతుల పొడిని నీటిలో మరిగించి తీసుకోవచ్చు.. లేకపోతే.. మెంతికూరను మీ ఆహారంలో జోడించుకోండి..

అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వీటిని ఉపయోగించే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మల్లె చెట్టుకు గుత్తులు గుత్తులుగా పూలు పూయాలా? చాక్ పీస్ చిట్కా
మల్లె చెట్టుకు గుత్తులు గుత్తులుగా పూలు పూయాలా? చాక్ పీస్ చిట్కా
TG ECET 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
TG ECET 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
అపర ఏకాదశి స్పెషల్.. పారిజాత యోగంతో ఈ రాశులకు గోల్డెన్ టైమ్,.
అపర ఏకాదశి స్పెషల్.. పారిజాత యోగంతో ఈ రాశులకు గోల్డెన్ టైమ్,.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన లైవ్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన లైవ్..
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరిన మోదీ
బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరిన మోదీ