AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంట్లో వేడి ఎక్కువయ్యి యూరిన్ రాని వాళ్ళు.. ఈ వడలు రెండు తినండి చాలు..

అలసందలు (బొబ్బర్లు) పోషకాల గని. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉడికించిన అలసందలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, జీర్ణక్రియ, బరువు నిర్వహణకు మేలు కలుగుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

ఒంట్లో వేడి ఎక్కువయ్యి యూరిన్ రాని వాళ్ళు.. ఈ వడలు రెండు తినండి చాలు..
Benefits Of Alasandalu
Shaik Madar Saheb
|

Updated on: Nov 13, 2026 | 3:18 PM

Share

మన ఆరోగ్యానికి అలసందలు (బొబ్బర్లు) ఎంతో మేలు చేస్తాయి. ఇవి అనేక పోషక విలువలతో నిండి ఉన్నందున, మనల్ని కొన్ని రోగాల దరిచేరకుండా అడ్డుకుంటాయి. అలసందలను ఉడికించి తినడం వల్ల వాటిలోని అన్ని పోషక విలువలను మనం పూర్తిగా పొందవచ్చు. ఇవి శరీరంలోని వేడిని తగ్గించి.. శక్తిని అందిస్తాయని డైటీషియన్లు చెబుతున్నారు. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, జింక్, కాపర్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలసందల వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

ప్రతి రోజూ ఉడికించిన అలసందలు తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అందుతాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇవి ఆందోళన, ఒత్తిడిని తగ్గించి, జీవక్రియ రేటును పెంచుతాయి.

అలసందలలో ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగిన విధంగా ఉండేలా నియంత్రిస్తుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

అలసందలలో సొల్యూబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది, కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు అలసందలు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది.

కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో కూడా అలసందలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి, తద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

బరువు తగ్గాలనుకునే వారికి అలసందలు అద్భుతమైన ఆహారం. వీటిలోని సోడియం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.

అలసందలు తక్షణ శక్తిని కూడా అందిస్తాయి.. ఇది మనల్ని బలంగా, చురుకుగా ఉండేలా చేస్తాయి.. అంతేకాకుండా శరీరంలోని వేడిని తగ్గిస్తాయి..

విటమిన్ ఏ, విటమిన్ సి అలసందలలో పుష్కలంగా ఉండటం వల్ల చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి చర్మాన్ని కాంతివంతంగా, నిత్య యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.. చర్మంపై ముడతలు రాకుండా నిరోధిస్తాయి.

అలసందలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు బలంగా, ఆరోగ్యంగా, పొడవుగా పెరగడానికి తోడ్పడతాయి. జుట్టు ఊడిపోయే సమస్యను తగ్గించి, జుట్టు ఎదుగుదలకు సహాయం చేస్తాయి.

విటమిన్ ఏ అధికంగా ఉన్నందున, అలసందలు కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి.. ఇంకా కంటి చూపును మెరుగుపరుస్తాయి.

మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఉడికించిన అలసందలు తింటే సుఖ మల విసర్జన జరుగుతుంది. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

అలసందలలో జింక్ ఉండటం వల్ల శృంగార జీవితం ఆనందంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. అలసందలు వీర్య వృద్ధిని కలిగించి, సామర్థ్యాన్ని పెంచుతాయని కూడా చెబుతారు.

ఈ విధంగా, అలసందలు మన దైనందిన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే.. ఏమైనా సమస్యలుంటే నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us