AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనిషి చేతిలో కోడి.. కింద భారీ మొసళ్లు.. ఒళ్లు గగుర్పొడిచే సీన్.. చూస్తే వెన్నులో వణుకు..!

మొసలి అంటేనే భయం.. అలాంటిది భారీ మొసలి కళ్లముందే నీటిలోంచి ఒక్కసారిగా పైకి ఎగిరి దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఎంతటి ధైర్యవంతులైనా ఒక్కసారిగా ఉలిక్కిపడాల్సిందే. ప్రాణాలను పణంగా పెట్టి మొసళ్లకు ఆహారం అందిస్తున్న ఓ హ్యాండ్లర్ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మనిషి చేతిలో కోడి.. కింద భారీ మొసళ్లు.. ఒళ్లు గగుర్పొడిచే సీన్.. చూస్తే వెన్నులో వణుకు..!
Giant Crocodile Leaps Out
Balaraju Goud
|

Updated on: Nov 13, 2026 | 12:36 PM

Share

మొసలి అంటేనే భయం.. అలాంటిది భారీ మొసలి కళ్లముందే నీటిలోంచి ఒక్కసారిగా పైకి ఎగిరి దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఎంతటి ధైర్యవంతులైనా ఒక్కసారిగా ఉలిక్కిపడాల్సిందే. ప్రాణాలను పణంగా పెట్టి మొసళ్లకు ఆహారం అందిస్తున్న ఓ హ్యాండ్లర్ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రెప్పపాటులో జరిగిపోయిన ప్రమాదం!

వైరల్ వీడియోలో ఓ వ్యక్తి చేతిలో కోడిని పట్టుకుని రెయిలింగ్ వద్ద నిలబడ్డాడు. కింద నీటిలో రెండు భారీ మొసళ్లు ఆహారం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇంతలో ఓ మొసలి ఒక్కసారిగా నీటిలో నుంచి పైకి ఎగిరి తన భారీ దవడలతో కోడిని అందుకోవాలని చూసింది. మొసలి వేగానికి నీటిలో నుంచి ఒక్కసారిగా పైకి ఎగిసిపడింది. ఈ క్రమంలో హ్యాండ్లర్ తన చేతిని వెంటనే వెనక్కి లాగడంతో ప్రమాదం తప్పింది. కొద్ది క్షణాల పాటు అతడి చేతి వేళ్లకు ఏమైనా జరిగిందా అన్న ఉత్కంఠ నెలకొంది.

ఎక్కడ జరిగింది? హ్యాండ్లర్ ఎవరు?

ఈ వీడియో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండోలో ఉన్న ప్రముఖ గేటర్‌ల్యాండ్ పార్కులో జరిగిన ఘటనగా భావిస్తున్నారు. అక్కడ జాన్ బర్కెట్ అనే హ్యాండ్లర్ నిర్వహించే ‘జంపరూ’ ప్రదర్శనలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. బిగ్ జార్జ్ అనే భారీ మొసలి తన అద్భుతమైన గంతులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ తరహా ప్రదర్శనకు సంబంధించిన వీడియో గతంలోనూ వైరల్ అయిందని జాన్ వెల్లడించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటన తర్వాత ప్రేక్షకులు, హ్యాండ్లర్ల భద్రత కోసం రెయిలింగ్‌ను మరింత పటిష్టం చేసినట్లు సమాచారం.

ధైర్యమా? ప్రాణాలతో చెలగాటమా?

ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అతడిని ఎంతో అనుభవం ఉన్న ప్రొఫెషనల్ హ్యాండ్లర్ అంటూ ప్రశంసిస్తుంటే, మరికొందరు ఇలాంటి ప్రమాదకర జంతువులకు చేతితో ఆహారం అందించడం ఎంతమాత్రం సురక్షితం కాదని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక పరికరాలు ఉపయోగించకుండా ఇంత దగ్గరగా వెళ్లడం ప్రాణాలకే ప్రమాదమని అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి, కొన్ని సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. మొసలి ఒక్కసారిగా దాడి చేసిన వేగం చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజమైన ధైర్యసాహసమా? లేక ప్రాణాలతో చెలగాటమా?

వైరల్ వీడియో కోసం జాన్ బర్కెట్ అనే హ్యాండ్లర్ పేజీలో చూడండి..

Crocodile Jump

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us