కూరగాయలతో ఘుమఘుమలాడే వెజ్ పులావ్.. హోటల్ స్టైల్‌లో ఇంట్లోనే

Prasanna Yadla

13 November 2026

Pic credit - Pinterest

ముందుగా ఒక మీడియం సైజ్ గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు పచ్చి పాలు తీసుకోవాలి.

ఒక కప్పు పచ్చి పాలు

బిర్యానీ ఆకు 2, లవంగాలు 6, యాలకులు 5, షాజీరా చిటికెడు , జాపత్రి కొద్దిగా , పుదీనా , కొత్తిమీర కొద్దిగా , అర టీ స్పూన్  గరం మసాలా , నూనె రెండు టేబుల్ స్పూన్స్  తీసుకోవాలి. 

కావలసిన పదార్ధాలు

దాల్చిన చెక్క కొద్దిగా మరాఠి మొగ్గలు 2, జాజికాయ పిడి చిటికెడు , అల్లం వెల్లుల్లి పేస్ట్  2 స్పూన్స్, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, నెయ్యి అర చెంచా , నానబెట్టిన బియ్యం , తగినన్ని  నీళ్లు తీసుకోవాలి. 

కావలసిన పదార్ధాలు

ముందుగా పొయ్యి వెలిగించి దానిపై గిన్నె ఉంచాలి.గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడి అయ్యాక బిర్యానీ ఆకులు వేయాలి. 

స్టెప్ 1

వీటితో పాటు లవంగాలు, యాలకులు, రాతి పువ్వు, జాపత్రి, మరాఠి మొగ్గ,షాజీరా, దాల్చిన చెక్క వేసి దోరగా వేయించాలి.

స్టెప్ 2

తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా కొత్తిమీర వేసి బాగా వేయించాలి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్  వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.

స్టెప్ 3

తర్వాత జాజికాయ, పొడి గరం మసాలా పొడి వేసి కలపాలి. ముందుగా నానబెట్టుకున్న బియ్యాని గిన్నె లో వేసి  ఒక నిమిషం పాటు చిన్న మంట పై వెయ్యించాలి.

స్టెప్ 4

ఆ తరువాత దీనిలో వేడినీళ్లు పోసి 5 నిముషాలు పాటు సన్నని మంటపై ఉడికించాలి. ఆ తరువాత మంటను తగ్గించి ఇంకో 10   నిముషాలు పాటు ఉడికించాలి. చివర్లో  కొద్దిగా పుదీనా, కొత్తిమీర,నెయ్యి వేసి దించేయ్యాలి. అంతే వేడి వేడి రుచికరమైన పూలవ్ రెడీ. 

స్టెప్ 5