జున్నుపాలు లేకుండా 10 నిమిషాల్లో చేసే గడ్డలాంటి జున్ను

Prasanna Yadla

13 November 2026

Pic credit - Pinterest

ముందుగా ఒక మీడియం సైజ్ గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు పచ్చి పాలు తీసుకోవాలి.

ఒక కప్పు పచ్చి పాలు

ఇప్పుడు దీనిలో అర కప్పు పెరుగు కూడా వేసి అసలు ఉండలు లేకుండా దీనిని బాగా కలపాలి.

అర కప్పు పెరుగు 

ఆ తరవాత దీనిలో రుచికి సరిపడా బెల్లం తురుము ఇంకా దీనిలో  చక్కెర వేసుకోవాలి.

బెల్లం తురుము

ఇంకా జున్నుకు మంచి రుచి, మంచి వాసన రావడానికి దీనిలో కొద్దిగా యాలకుల పొడిని కూడా కలపాలి.

యాలకుల పొడి

ఇప్పుడు మీరు గడ్డలాంటి జున్ను తయారవ్వడానికి దీనిలో రెండు టేబుల్ స్పూన్స్  కార్న్ ఫ్లోర్ ఇంకా కస్టర్డ్ పౌడర్ వేసి కలపాలి.

 కస్టర్డ్ పౌడర్

ఇంకా ఈ మిశ్రమాన్ని మీరు వడకట్టి గడ్డలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇది  జున్నులా అవుతుంది 

గడ్డలు లేకుండా చూసుకోవాలి

ఇప్పుడు స్టవ్‌పై మందపాటి గిన్నె కూడా పెట్టి ఈ మిశ్రమాన్ని  పోసి సన్నని మంటపై అడుగంటకుండా దీనిని కలుపుతూ చిక్కగా అయ్యేలా ఉంచాలి

చిక్కగా అయ్యేలా ఉంచాలి 

ఇది మొత్తం చల్లారిన తర్వాత దీనిని ఫ్రిజ్‌లో కొద్దిసేపు ఉంచి దీనిని ముక్కలుగా కట్ చేసుకుంటే జున్ను రెడీ 

 జున్ను రెడీ