ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా.. స్కిన్ కేర్ రొటీన్ మాత్రం ఇలానే ఉండాలట.. ఎందుకో తెలుసా..?
ప్రతి రోజు మనం ఫేస్ వాష్ చేస్తాం. ముఖం శుభ్రంగా ఉండాలంటే ఇదొక మొదటి దశ మాత్రమే. కానీ ఫేస్ వాష్ తర్వాత తీసుకునే జాగ్రత్తలు చాలా ముఖ్యం. చర్మం పొడి అయిపోకుండా తేమతో నిండిపోవాలంటే కొన్ని ముఖ్యమైన దినచర్యలు పాటించాలి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

ముఖం కడిగిన వెంటనే రంధ్రాలు తెరుచుకుంటాయి. అప్పుడు టోనర్ వాడటం వల్ల అవి మళ్లీ బిగుతుగా మారతాయి. టోనర్ pH స్థాయిని సమంగా ఉంచుతుంది. రోజ్ వాటర్, గ్రీన్ టీ లేదా కలబంద ఆధారంగా తయారైన టోనర్లు వేసవిలో చర్మానికి చల్లదనాన్ని ఇస్తాయి. చర్మం తేలికగా ఫ్రెష్ గా అనిపించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఫేస్ వాష్ చేసిన వెంటనే చర్మం తడిగా ఉంటుంది. అలాంటి సమయంలో సీరం వేయడం వల్ల అది లోపలికి బాగా చొచ్చుకుపోతుంది. విటమిన్ సి, హైలురోనిక్ యాసిడ్ లేదా నియాసినమైడ్ కలిగిన సీరంలు చర్మాన్ని మెరిసేలా, బిగుతుగా, మృదువుగా మారుస్తాయి. ఇవి తక్కువ పరిమాణంలో ఎక్కువ ఫలితం ఇస్తాయి.
ముఖం కడిగిన తర్వాత చర్మం నుండి తేమ ఆవిరైపోతుంది. దాంతో చర్మం పొడిగా మారే అవకాశం ఉంటుంది. మంచి మాయిశ్చరైజర్ చర్మాన్ని తేమతో నింపుతుంది. జిడ్డుగల వారు జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. పొడిగా ఉండే వారు క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఎంచుకుంటే మంచిది. ఇది చర్మాన్ని సాఫ్ట్ గా ఉంచుతుంది.
చర్మ సంరక్షణలో చాలా మంది కళ్ల చుట్టూ ప్రాంతాన్ని పట్టించుకోరు. కానీ అక్కడే వృద్ధాప్యం తొందరగా కనిపిస్తుంది. అలాంటి చోట తేలికపాటి ఐ క్రీమ్ అప్లై చేయాలి. ఇది నల్లటి వలయాలు, ఫైన్ లైన్లు తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు రాత్రి వేసుకోవడం అలవాటు చేసుకుంటే కళ్ళ చుట్టూ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
చర్మానికి సూర్య కిరణాల ప్రభావం ఎక్కువ. UV కిరణాలు చర్మానికి హాని చేస్తాయి. అందుకే ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా సన్ స్క్రీన్ వాడాలి. కనీసం SPF 30 ఉన్న సన్ స్క్రీన్ చర్మాన్ని రక్షిస్తుంది. ఇది టానింగ్, ముడతలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతి రోజు దాన్ని ముఖానికి అప్లై చేయడం అవసరం.
ఇలా రోజు అనుసరించడం వల్ల చర్మం మెరిసేలా ఉంటుంది. తేమగా, ఆరోగ్యంగా ఉంటుంది. సులభంగా ఇంట్లో అందరికీ చేయగలిగే ఈ చిట్కాలు ముఖానికి జీవం పోస్తాయి. ఏ వయసు వారు అయినా ఈ విధానం పాటిస్తే మంచి ఫలితాలు పొందొచ్చు.




