AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips: ఫస్ట్ టైమ్ స్కూల్ కి వెళ్లే పిల్లలకు ఇవి తప్పకుండా నేర్పించండి..!

పిల్లలు తొలిసారి పాఠశాలకు వెళ్లే రోజు తల్లితండ్రులకు మరిచిపోలేని క్షణం. ఆ రోజు కొత్తదనం, కొంత భయం కలగజేస్తాయి. చిన్న వయస్సులో కొత్త ప్రదేశం, కొత్త వ్యక్తులు, ఉపాధ్యాయులతో ఉండటం సులభం కాదు. అలాంటి పరిస్థితిలో ముందుగా కొన్ని విషయాలు నేర్పితే పిల్లలు ధైర్యంగా ఉండగలుగుతారు. అప్పుడు అనుభవం ఆనందంగా మారుతుంది. ఆ సమయంలో భయపడకుండా నేర్చుకోవడంపై దృష్టి పెడుతారు. మొదటి రోజు సాఫీగా సాగాలంటే తల్లితండ్రులు కొన్ని చిట్కాలు పాటించాలి.

Parenting Tips: ఫస్ట్ టైమ్ స్కూల్ కి వెళ్లే పిల్లలకు ఇవి తప్పకుండా నేర్పించండి..!
First Day School
Prashanthi V
|

Updated on: May 29, 2025 | 5:19 PM

Share

పాఠశాలలో టీచర్లు, ఇతర పిల్లలతో కలిసినప్పుడు చిరునవ్వుతో పలకరించడం మంచిదని పిల్లలకు వివరించాలి. హలో అనడం ఒక మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల పిల్లలలో నమ్మకం పెరుగుతుంది. పరిచయం లేని వారితో స్నేహంగా మాట్లాడే ధైర్యం వస్తుంది.

బాత్రూమ్‌ కు వెళ్లాలనిపించినా, ఆకలి వేసినా, దాహంగా ఉన్నా.. ఈ విషయాలను టీచర్‌ కు చెప్పడం ఎలా అనే విషయాన్ని ముందే వివరించాలి. ఇలా అలవాటు చేస్తే పిల్లలు తాము ఎదుర్కొనే పరిస్థితులను చెప్పగలుగుతారు. సమస్యను అర్థం చేసుకొని పరిష్కారం పొందగలరు.

టిఫిన్ బాక్స్ తెరవడం, తినడం, బాటిల్ తీసుకొని నీరు తాగడం వంటి చిన్న పనులు తామకు తామే చేయగలగాలి. ఇది వారిలో స్వతంత్ర భావాన్ని పెంచుతుంది. ఏదైనా సహాయం అవసరమైతే టీచర్‌ కు ఎటువంటి భయం లేకుండా తెలియజేయాలని చెప్పాలి. అవసరానికి సరైన దారిని ఎంచుకోవడం అలవాటు అవుతుంది.

స్కూల్ బ్యాగ్, టిఫిన్, బాటిల్.. ఇవన్నీ తామే చూసుకోవాలి. ప్రతి వస్తువును ఎక్కడ ఉంచాలో, ఎలా ఉపయోగించాలో నేర్పించాలి. ఏదైనా వస్తువు కనిపించకపోతే ఉపాధ్యాయునికి వెంటనే తెలియజేయాలని ముందుగా చెప్పాలి. ఇది జాగ్రత్తగా ఉండే నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది.

పాఠశాల పూర్తయ్యాక తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తారని నమ్మకం ఇవ్వాలి. ఇలా చెప్పితే పిల్లలు భయపడకుండా రోజంతా ప్రశాంతంగా గడుపుతారు. కచ్చితంగా సమయానికి వస్తామని చెప్పడం వారిలో భద్రత కలిగిస్తుంది. స్కూల్‌ కి పంపే సమయంలో ప్రేమతో మాట్లాడితే ఉదయం బాధగా ఉన్నా రోజంతా ఉత్సాహంగా గడిపేస్తారు.

ఈ చిట్కాలు పాటిస్తే మొదటి రోజు పిల్లలకు ఆనందంగా ఉంటుంది. చుట్టూ ఉన్న కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నేర్చుకోవాలనే భావనలో మార్పు కనిపిస్తుంది. పిల్లలు సురక్షితంగా, ధైర్యంగా ఉండటానికి తల్లితండ్రుల సహకారం ఎంతో అవసరం.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..