AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car AC: మీ కారులో ఏసీ మాటిమాటికీ ట్రబుల్ ఇస్తుందా.. ఇలా చేస్తే మీ జర్నీ కూల్‌గా సాగిపోతుంది..

బయటి టెంపరేచర్ చూస్తుంటే ఇంట్లో నుంచి కాలు తీసి కాలు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. పూర్తిగా ఎండాకాలంలోకి ఎంటరవ్వకముందే పరిస్థితి ఇలా ఉంది. ఇక ఇలాంటి సమయంలోనే మీ కారులో ఏసీ కూడా మొరాయిస్తే ఏంటి పరిస్థితి. ఎండాకాలం, ఏసీ రిపేర్లు కలిసే వస్తుంటాయి. కారు పనితీరుపై ముందునుంచే ఓ కన్నేసి ఉంచితే సమ్మర్లో కూడా మీ ప్రయాణాలను ఎంజాయ్ చేయొచ్చు. మీ కారులో ఏసీ సమస్యను ట్రిగ్గర్ చేసే ప్రదేశాలివే..

Car AC: మీ కారులో ఏసీ మాటిమాటికీ ట్రబుల్ ఇస్తుందా.. ఇలా చేస్తే మీ జర్నీ కూల్‌గా సాగిపోతుంది..
Car Ac Summer Troubles
Bhavani
|

Updated on: Feb 19, 2025 | 7:40 PM

Share

ఎర్రటి ఎండాకాలంలో ఏసీ లేని కారులో ప్రయాణం చేయడం అంటే ఊహించుకోవడానికి భయపడతారు. ముఖ్యంగా కారును గంటల తరబడి ఎండలో పార్కు చేసేవారు.. దూర ప్రయాణాలు చేసేవారికి ఇది మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఎంత మంచి కారు కొన్నా అందులోని ఏసీ మాటిమాటికీ ట్రబుల్ ఇస్తుంటే ఏంటి ప్రయోజనం. కొన్ని కార్లలో ఏసీ ఉన్నా దాని వల్ల పెద్ద ఉపయోగమేమీ ఉండదు. ఎందుకంటే ఏసీ రావాల్సిన దాని కన్నా తక్కువ కూలింగ్ ను ఇస్తుంటుంది. ఇలాంటప్పుడే మీరు సొంతంగా సమస్యను చెక్ చేసుకోవచ్చు. ముందు మీ కారులో ఈ విడి భాగాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకోండి. వాటి పనితీరు మీ కారు ఏసీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందనే సమాచారం ఇది..

మంచి కంప్రెసర్ వాడుతున్నారా..

ఏసీ కంప్రెసర్ అనేది కారులోని ఏసీ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇది రిఫ్రిజిరాంట్ ను హై ప్రెజర్ గ్యాస్ గా కుదించడానికి ఉపయోగపడుతుంది. ఒక వేళ ఏసీ కంప్రెసర్ పని చేయకుంటే ఇది మీ జేబుకు పెద్ద నష్టమే కలిగిస్తుంది. ఎందుకంటే ఇది మిగిలిన విడి భాగాలతో పోలిస్తే కాస్త ధర ఎక్కువే ఉంటుంది. కంప్రెసర్ ను ఓవర్ హీట్ చేయడం, లేదా బాహ్యంగా డ్యామేజ్ చేయడంవల్ల తొందరగా రిపేర్ వస్తుంటుంది. దీని పనితీరును ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుండాలి.

ఎవాపరేటర్‌లో లోపాలుంటే..

కారులో ఉండే ఏసీ ఎవాపరేటర్ చల్లని గాలిని లోపలికి వచ్చేలా చేస్తుంది. ఇది మీ కారు డాష్ బోర్డు లోపల ఉంటుంది. ఆల్రెడీ డ్యామేజీ అయిన లేదా లోపాలున్న ఏసీ ఎవాపరేటర్ ను వాడుతుంటే రిఫ్రిజిరాంట్ కూడా లక్ అవుతుంది. కొన్ని సార్లు దీని లైన్లు దెబ్బతినడం వల్ల కూడా ఇవి లీకవుతుంటాయి. ఇది కొనడానికి పెద్ద ఖర్చేమీ కాదు. కానీ ఇది కారు డాష్ బోర్డులో ఉండటం వల్లనే అసలు సమస్య. దీనిని అక్కడి నుంచి తీసి రిపేర్ చేయించడం లేదా మార్చడం చాలా శ్రమతో కూడుకున్న పని.

సరైన బ్లోవర్ లేకపోవడం..

కారు క్యాబిన్ అంతా ఫ్యాన్ లు ఉపయోగించి గాలిని మళ్లించడం బ్లోవర్ పని. అయితే ఇందులో లోపాలుంటే ముందే సరిచూసుకోవడం మంచిది. కొన్నిసార్లు కారు మీటర్ రీడింగ్ ఎక్కువగా ఉండటం.. లేదా మోటార్ లో వైఫల్యం కారణంగా ఇది మీ కారు పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది.

తక్కువ కూలింగ్ ఏజెంట్..

కారులోని ఏసీ పనిచేయకపోవడానికి చాలా కారణాలే ఉంటాయి. అందులో ఒకటి లీకేజీ లేదా తక్కువ రిఫ్రిజిరెంట్ స్థాయిలు ఉన్నదాన్ని ఉపయోగించడం. దీని వల్ల ఏసీ పనిచేయకపోవచ్చు. రిఫ్రిజిరాంట్ మార్చడం కన్నా లీకేజీని గుర్తించి సరిచేయడం పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారుతుంది.

ఏసీ కండెన్సర్ చెక్ చేసుకోండి..

రేడియేటర్ గుండా వెళ్తున్న గాలిని చల్లబరచడానికి ఏసీ కండెన్సర్ ఉపయోగిస్తారు. ఇది ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. వాహన ప్రారంభ దశలోనే ఇది అమర్చబడి ఉంటుంది. దీని వల్ల కండెన్సర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీనిలో రిపేర్లు వస్తే మార్చడం చాలా ఖరీదైన పనే. కానీ, కొన్ని సందర్భాల్లో రిపర్లతో సరిపెట్టవచ్చు.

Follow Us