AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curd Benefits: షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్యఔషధం పెరుగే.. రోజూ ఓ కప్పు పెరుగుతో ఎన్ని ప్రయోజనాలో..!

మధుమేహంతో పోరాడడమే కాకుండా ఇతర వ్యాధులతో పోరాడడానికి సాయం చేస్తుంది. ముఖ్యంగా పెరుగులో ఉండే ప్రోబయోటిక్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తేలింది.  మధుమేహం ఉన్నవారిలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి లేదా ఉద్భవించే స్థాయిని తగ్గించానికి సాయపడుతుంది.

Curd Benefits: షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్యఔషధం పెరుగే.. రోజూ ఓ కప్పు పెరుగుతో ఎన్ని ప్రయోజనాలో..!
Curd
Nikhil
|

Updated on: Mar 21, 2023 | 9:00 PM

Share

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధ లేకుండా మధుమేహం అందరినీ వేధిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహం రక్షణ కోసం జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి రోజూ ఆహారంలో ఓ కప్పు పెరగు తింటే అద్భుత ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహంతో పోరాడడమే కాకుండా ఇతర వ్యాధులతో పోరాడడానికి సాయం చేస్తుంది. ముఖ్యంగా పెరుగులో ఉండే ప్రోబయోటిక్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తేలింది.  మధుమేహం ఉన్నవారిలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి లేదా ఉద్భవించే స్థాయిని తగ్గించానికి సాయపడుతుంది. పెరుగు అధికంగా తీసుకోవడం ద్వారా టైప్‌-2 డయాబెటిస్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఈ ప్రమాదాన్ని దాదాపు 14 శాతం వరకూ నయం చేయవచ్చని పరిశోధనల్లో తేలింది. ప్రతిరోజూ 80 నుంచి 123 గ్రాముల పెరుగు తింటే ప్రోబయోటిక్ ప్రభావం గ్లూకోజ్ జీవక్రియను నియంత్రించడంలో సాయం చేస్తుంది. ముఖ్యంగా వృద్ధుల్లో మధుమేహం ప్రభావాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మధుమేహ రోగులకు పెరుగు ఎంత చక్కటి ఆహారంగా ఉంటుందో ఓ సారి తెలుసుకుందాం. 

తక్కువ పిండి పదార్థాలు

పూర్తి కొవ్వు పదార్థాల కంటే తక్కువ కొవ్వు ఉన్న పెరుగును ఎల్లప్పుడూ ఎంచుకోవాలి. ముఖ్యంగా కమ్మగా ఉండే పెరుగులో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్న ఆహారంలో పెరుగును చేర్చుకోవడం చాలా కీలకం. ఎందుకంటే అధిక కార్భ్ ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

అధిక ప్రోటీన్లు

పెరుగులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు, ఫైబర్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అలాగే పెరుగు ఎక్కువ తినడం వల్ల మీకు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దీంతో ఎక్కువ తినాలనే కోరిక నశిస్తుంది. వంద గ్రాములు పెరుగులో దాదాపు 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను అరికట్టడానికి సాయం చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

అదుపులో కొలెస్ట్రాల్ స్థాయి

మధుమేహం అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో సంబంధ కలిగి ఉంటుంంది. ఇది గ్లూకోజ్ జీవక్రియను నిరోధిస్తుంది. పెరుగులో ఉండే లాక్టిస్ వంటి బ్యాక్టిరియాలో మధుమేహంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగల సామర్థాన్ని కలిగి ఉంటాయి.

తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్

పెరుగు అధికంగా తింటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్  మధుమేహాన్ని తగ్గిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. 92 శాతం సాధారణ పెరుగులో తక్కువ జీఐ ఉంటుంది. ఇది మధుమేహం నియంత్రిచడంలో బాగా పని చేస్తుంది. 

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.