Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curd vs Buttermilk: పెరుగు లేదా మజ్జిగ.. ఈ రెండిట్లో ఏది ఆరోగ్యానికి ఉత్తమం? నిపుణుల సలహా ఏంటంటే?

చాలామంది మజ్జిగ కంటే పెరుగు తినడానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు. అదే సమయంలో ఇవి రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదనే అనుమానం అందరిలోనూ ఉంటుంది.

Curd vs Buttermilk: పెరుగు లేదా మజ్జిగ.. ఈ రెండిట్లో ఏది ఆరోగ్యానికి ఉత్తమం? నిపుణుల సలహా ఏంటంటే?
Curd Vs Buttermilk
Follow us
Basha Shek

|

Updated on: Feb 02, 2023 | 7:07 PM

పాలు, పెరుగు, నెయ్యి, వెన్న.. ఇలా పాలకు సంబంధించిన పదార్థాలన్నీ ఏదో ఒక విధంగా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే చాలామంది మజ్జిగ కంటే పెరుగు తినడానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు. అదే సమయంలో ఇవి రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదనే అనుమానం అందరిలోనూ ఉంటుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం, పెరుగును మధ్యాహ్నానికి ముందు తింటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల బీపీ వస్తుంది. కాబట్టి, అల్పాహారం తర్వాత పెరుగు తినండి. చాలా మంది రాత్రిపూట పెరుగు తింటుంటారు. పెరుగు చల్లగా ఉంటుంది కాబట్టి రాత్రిపూట దీన్ని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులతో పాటు దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. పెరుగు తినడానికి ముందు ఎప్పుడూ వేడి చేయకూడదు. ఆయుర్వేదం ప్రకారం, పెరుగుతో పంచదార కలిపి తింటే మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. ఇక మజ్జిగ విషయానికొస్తే.. దీనిని ఎప్పుడైనా తీసుకోవచ్చు. మీరు భోజనం తర్వాత తాగవచ్చు. అయితే, సాయంత్రం లేదా రాత్రిపూట తినడానికి ముందు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే ఉదర సంబంధిత సమస్యలు ఉంటే ఉదయం ఖాళీ కడుపుతో మజ్జిగ తాగడం ఉత్తమం. ఇక బరువు పెరగాలనుకుంటే, పెరుగు ఎక్కువగా తినండి. ఇందులోని కొవ్వు పదార్ధాల కారణంగా బరువు పెరగడానికి సహాయపడుతుంది. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే మజ్జిగ ఎక్కువగా తీసుకోండి. ఇది శరీరంలోని డీహైడ్రేషన్‌ని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

  • ఇక మజ్జిగ అన్ని రుతువులకు అనుకూలంగా ఉంటుంది. పెరుగు కంటే మజ్జిగ చాలా ఆరోగ్యకరమైనది. పెరుగు కొవ్వు, శక్తిని పెంచుతుంది.
  • అలాగే వాత అసమతుల్యతను తగ్గించడంలో పెరుగు సహాయపడుతుంది.
  • అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటే పెరుగుకు దూరంగా ఉండాలి.
  •  స్థూలకాయం, కఫం, రక్తస్రావం, మంట, కీళ్లనొప్పులు ఉన్నవారు పెరుగుకు దూరంగా ఉండాలి.
  • రాత్రిపూట పెరుగు తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇది జలుబు, దగ్గు, సైనస్‌ని ప్రేరేపిస్తుంది.
  • పెరుగును వేడి చేయడం మానుకోండి. ఎందుకంటే ఇది అన్ని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
  • చర్మవ్యాధులు, తలనొప్పి, నిద్ర సమస్యలు, జీర్ణక్రియ లోపాలు ఉన్నవారికి పెరుగు సరిపడదు.
  • పెరుగుకు మజ్జిగ ఉత్తమ ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు. మజ్జిగ వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు
  • మజ్జిగ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వ్యాధులను నయం చేస్తుంది.
  •  ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అన్ని శరీర రకాలకు అనుకూలం.
ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by DrDimple, Ayurveda & Gut Health Coach (@drdimplejangda)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..