Sugar Problems: ఆహార అలవాట్లతోనే షుగర్ ముప్పు అధికం.. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినాల్సినవి, తినకూడనివి ఇవే..
ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం 20 నుంచి 79 వయస్సున్న వారు దాదాపు 537 మిలియన్ల మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 630 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా మధుమేహం సమస్య అందరినీ వేధిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే సాధారణ వ్యాధుల్లో మధుమేహం ఒకటి. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం 20 నుంచి 79 వయస్సున్న వారు దాదాపు 537 మిలియన్ల మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 630 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మధుమేహం అనేది ధీర్ఘకాలిక వ్యాధి. దీన్ని గుర్తించకపోతే గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు వంటి ఇతర సమస్యలకు కారణం కావచ్చు. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి కారణంగా డయాబెటిస్ సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు కచ్చితంగా నిర్థిష్ట ఆహార నియమాలు పాటించాలని నిపుణులు చెబతున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం.
షుగర్ వ్యాధిగ్రస్తులు తినకూడని పదార్థాలు
ఫ్రెంచ్ ఫ్రైస్
బంగాళదుంపల్లో కార్భోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అయితే వాటిని ఒలిచి నూనెలో వేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు కాల్చిన స్వీట్ పొటాటో తినడం ఉత్తమం.
వైట్ బ్రెడ్
వైట్ బ్రెడ్ తింటే టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారి షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. వైట్ బ్రెడ్ లో చాలా తక్కువ ఫైబర్ ఉంటుంది. అందువల్ల షుగర్ పెరుగుతుందని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఫ్రూట్ జ్యూసెస్
పండ్ల రసాలు శక్తిని పొందడానికి మంచివని అందరికీ తెలిసిందే. కానీ షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పానియాలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వీటిల్లో ఫ్రక్జోజ్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా ప్రభావితం చేస్తుంది.
ఎండిన పండ్లు
పండ్లను ఎండబెడితే వాటిలో సహజంగా ఉండే నీటి కంటెంట్ పోతుంది. ఇది పోషకాల అధిక సాంద్రతకు దారి తీస్తుంది. అలాగే చక్కెర పెరగడానికి కూడా సాయం చేస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
షుగర్ వ్యాధిగ్రస్తులు తినాల్సిన ఆహారాలు ఇవే
ఓట్స్
ఓట్స్ లో ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అలాగే అవి తక్కువ గ్లైసెమిక్ స్థాయిలతో వస్తాయి. అలాగే డైలీ ఓట్స్ తింటే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. బ్లడ్ లో లిపిడ్ లను నియంత్రించడంలో సాయం చేస్తాయి.
బ్రోకలీ
బ్రోకలీలో సల్ఫోరాఫేస్ అనే యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గ్లూకోజ్ ఉత్ఫత్తిని పరిమితం చేయడంలో సాయం చేస్తుంది. విటమిన్లు – సి, కె, ఐరన్, ఫైబర్ వంటివి అధికంగా ఉంటాయి. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా తమ ఆహారంలో బ్రోకలీని యాడ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
హెర్బల్ టీ
షుగర్ వ్యాధిగ్రస్తులకు సాధారణ టీ కు దూరంగా ఉంటూ హెర్బల్ టీ తాగడం ఉత్తమం. పుదీనా, చమోమిలె, మందార టీ వంటి హెర్బల్ టీ లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం ఉన్న వారు ఈ టీలను తాగితే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధి చెందుతాయి. అలాగే క్యాలరీలు అస్సలు ఉండవు.
బాదం, పిస్తా, వాల్ నట్స్
కొంతమంది షుగర్ వ్యాధిగ్రస్తులు గింజలు తమ షుగర్ లెవెల్స్ ను పెంచుతాయనే భ్రమతో ఉంటారు. ఇది చాలా తప్పని బాదం, పిస్తా, వాల్ నట్స్ వంటివి శరీరానికి అవసరమయ్యే శక్తినిస్తాయని చెబుతున్నారు. వాటిల్లో ఫైబర్ అధికంగా ఉండడమే కాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించడంలో సాయం చేస్తాయి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..