Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Clove health benefits: జలుబు, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ బెస్ట్ ఇంటి చిట్కాను ఓ సారి ట్రై చేయండి.. సూపర్ రెమిడీ..

అది కేవలం మసాలా దినుసు మాత్రమే కాదు. ఔషధాల గని. మనిషి ఆరోగ్యానికి అది చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చలి కాలంలో జలుబు, ఫ్లూలకు మంచి విరుగుడుగా ఉపయోగపడుతుంది. అలాగే గొంతు నొప్పి, దగ్గు వంటి వాటిని తక్షణ ఉపశమనానికి బాగా ఉపకరిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

Clove health benefits: జలుబు, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ బెస్ట్ ఇంటి చిట్కాను ఓ సారి ట్రై చేయండి.. సూపర్ రెమిడీ..
Follow us
Madhu

|

Updated on: Feb 02, 2023 | 1:39 PM

లవంగం.. సాధారణంగా ప్రతి వంట గదిలో కనిపించే మసాలా దినుసు.. బిర్యానీలు, పలు నాన్ వెజ్ కూరల్లో ఎక్కువగా వినియోగిస్తారు. అయితే దానితో అంతకుమించిన ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? నిజం అండి అది కేవలం మసాలా దినుసు మాత్రమే కాదు. ఔషధాల గని. మనిషి ఆరోగ్యానికి అది చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చలి కాలంలో జలుబు, ఫ్లూలకు మంచి విరుగుడుగా ఉపయోగపడుతుంది. అలాగే గొంతు నొప్పి, దగ్గు వంటి వాటిని తక్షణ ఉపశమనానికి బాగా ఉపకరిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఎందుకంటే లవంగాలలో యూజినాల్, గల్లిక్ యాసిడ్, ఫినాలిక్ వంటి సమ్మళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ స్వభావం కలిగి ఉంటాయి. తద్వారా అనేక రకాల ఫ్లూ లనుంచి విడుదల ఇస్తాయి. ఎప్పుడైనా జలుబు, దగ్గు వంటివి వచ్చినప్పుడు వెంటనే మందులు వాడేయకుండా మన ఇంట్లోనే ఉండే ఈ లవంగం ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా లవంగాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై నిపుణులు చెబుతున్న విషయాలు మీకోసం..

దగ్గు నుంచి ఉపశమనం.. లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ లక్షణాల సమృద్ధిగా ఉండటం కారణంగా, దగ్గుకు లవంగం మంచి ఔషధంగా పరిగణించబడుతుంది. రాతి ఉప్పుతో ఒక లవంగాన్ని తీసుకుని బాగా నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. మీరు పొడి దగ్గు లేదా నిరంతర దగ్గుతో బాధపడుతుంటే, వెంటనే మందులు వాడేకన్నా ఈ సులభమైన ఇంటి చిట్కాను వినియోగించడం మేలు.

కాలేయ ఆరోగ్యానికి.. లవంగంలో అధిక పరిమాణంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర అవయవాలను, ముఖ్యంగా కాలేయాన్ని కాపాడటంలో సాయపడుతుంది. లవంగం హెపాటోప్రొటెక్టివ్ లక్షణాలతో, లిపిడ్ ప్రొఫైల్‌, రాడికల్ ఉత్పత్తి ప్రక్రియ వంటి జీవక్రియ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మధుమేహ రోగులకు మంచిది.. డయాబెటిక్ రోగుల విషయంలో, శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ మొత్తం శరీర అవసరాలకు సరిపోదు. అయితే లవంగం వాడకం శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచడంలో ఉపకరిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుందని చాలా పరిశోధనలు సూచిస్తున్నాయి.

రోగనిరోధక శక్తి బూస్టర్.. లవంగం మొగ్గ శరీరం యొక్క తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడానికి ఉపకరిస్తుంది. తద్వారా దానితో వచ్చే రోగనిరోధక లక్షణాలను పెంచుతుంది. ఇది శరీరం సహజ పనితీరుకు హాని కలిగించే బయటి ఏజెంట్లకు స్పందించే హైపర్సెన్సిటివిటీని తగ్గిస్తుంది.

నోటి దుర్వాసనకు చెక్.. లవంగాలు, వాటి ప్రత్యేక సువాసన కారణంగా నోటి దుర్వాసనను తొలగించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. టూత్‌పేస్ట్ తయారీలో ప్రధాన పదార్ధంగా విస్తృతంగా ఉపయోగించబడడమే కాకుండా, నోటి దుర్వాసన సమస్యను పరిష్కరించడానికి లవంగాన్ని పానీయాలు లేదా ఆహారంలో తీసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..