Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangoes: మామిడి పండ్లు వేడి చేస్తాయని భయపడుతున్నారా.. ఇలా తింటే సైడ్ ఎఫెక్ట్స్ రావు..

చాలా మందికి ఒకటీ రెండు మామిడి పండ్లు తింటే తృప్తి కలగదు. కడుపునిండా తిన్నా.. ఇంకా తినాలని తహతహలాడుతుంటారు. అదే మామిడి పండు రుచి ప్రత్యేకత. అయితే, అతిగా తింటే అమృతం కూడా విషం అవుతుంది అన్నది నానుడి.. అలాగే, ఇష్టమైన మామిడి పండ్లను కూడా అతిగా తింటే అనర్థమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మామిడి పండ్లను ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

Mangoes: మామిడి పండ్లు వేడి చేస్తాయని భయపడుతున్నారా.. ఇలా తింటే సైడ్ ఎఫెక్ట్స్ రావు..
Mango Fruit
Follow us
Bhavani

|

Updated on: Mar 27, 2025 | 9:09 PM

మామిడి రుచులను ఆస్వాదిద్దామంటే వేడి చేస్తుందని భయపడుతున్నారా? బరువు పెరుగుతామేమోనని బెంగగా ఉంది. మామిడి రుచులను ఇలా ఆస్వాదిస్తే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందొచ్చు.సమ్మర్ వచ్చిందంటే చాలు మామిడి పండ్ల ప్రియులకు పండుగే. నోరూరించే ఈ ఫలరాజులో బోలెడు పోషకాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఓవైపు మామిడి పండ్లు నోరూరిస్తున్నా.. హీట్‌కి భయపడి చాలా మంది మామిడి పండ్లు తినడానికి వెనుకంజ వేస్తారు. కానీ రోజుకు ఒకటి లేదా రెండు మామిడి పండ్లను తినడం ద్వారా వేసవి తాపం నుంచి తప్పించుకోవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. మామిడి పండ్లలో క్యుర్సెటిన్, ఫిసెటిన్, ఐసోక్యూరెసిట్రిన్, ఆస్ట్రాగాలిన్, గాలిక్ యాసిడ్, మిథైల్ గాలెట్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వేసవిలో వేడిమి కారణంగా సహజంగా తలెత్తే అలసట, డీహైడ్రేషన్ సమస్యలను తగ్గిస్తాయి.

ఆహారం మితంగా తినాలనుకునే వారు మామిడి పండ్లు తింటే త్వరగా ఆకలేయదని, కడుపు నిండిన భావన కలుగుతుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ముక్కలుగా కోసి మిక్సిలో వేసుకొని స్మూతీగానూ మామిడి రుచులను ఆస్వాదించొచ్చు.

మామిడి పండ్లను తినడం వల్ల శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వీటిలో విటమిన్ ఎ, ఐరన్, కాపర్, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. మామిడిలో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వీటిని ఉదయం, సాయంత్రం వేళల్లో తినడం వల్ల శరీరంలో కేలరీలు పేరుకుపోకుండా ఉంటాయి.

మామిడి పండ్లు తింటే బరువును పెరుగుతామని, వేడి చేస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ రోజుకు ఒకటి లేదా రెండు మామిడి పండ్లను బేషుగ్గా లాంగిచేయొచ్చు. మామిడిలో ఉండే చక్కెరలు, పీచు శరీరానికి మేలు చేస్తాయి. వేడి చేస్తుందనే భయం ఇంకా మీ మనసులో ఉంటే రాత్రి పడుకునే ముందు మామిడి పండ్లను నీటిలో వేసి.. ఉదయాన్నే భేషుగ్గా తినొచ్చు. ఇలా చేయడం వల్ల వేడి చేయదు.