Diwali Gifts: వెలుగునిచ్చే దీపావళి సొంత వారికి అదిరిపోయే బహుమతులు.. ఈ సింపుల్ గిఫ్ట్ ఐడియాలు మీ కోసమే..!
దీపావళి ఆనందం అందరికీ చేరాలనే ఉద్దేశంతో చాలా మంది తమ దగ్గర పని చేసే వాళ్లకు తమతో ఆత్మీయంగా మెలిగేవారికి బహుమతులు ఇస్తూ ఉంటారు. అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యులకు బహుమతులు ఇస్తూ ఉంటాం. కాబట్టి దీపావళి సందర్భంగా ఆత్మీయులకు ఇచ్చే అందమైన బహుమతుల గురించి ఓ సారి తెలుసుకుందాం.

భారతదేశం అంతటా దీపావళి సందడి నెలకొంది. ముఖ్యంగా దీపావళి అంటే బహుమతుల పండుగ. దీపావళి ఆనందం అందరికీ చేరాలనే ఉద్దేశంతో చాలా మంది తమ దగ్గర పని చేసే వాళ్లకు తమతో ఆత్మీయంగా మెలిగేవారికి బహుమతులు ఇస్తూ ఉంటారు. అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యులకు బహుమతులు ఇస్తూ ఉంటాం. కాబట్టి దీపావళి సందర్భంగా ఆత్మీయులకు ఇచ్చే అందమైన బహుమతుల గురించి ఓ సారి తెలుసుకుందాం.
సోలార్ మెటల్ లాంతర్లు
దీపావళి అనేది దీపాల పండుగ. కాబట్టి ఈ సందర్భంలో అందమైన సోలార్ లాంతర్‌లతో డెకరేషన్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకురావచ్చు. సాధారణంగా సోలాలర్ ల్యాంప్‌లు అంటే పగటిపూట ఛార్జ్ అవుతాయి. రాత్రి సమయంలో వెలుగుతాయి. అందువల్ల ఇవి దీపావళి తర్వాత కూడా ఇవి ఉపయోగపడతాయి.
దీపావళి గిఫ్ట్ బాక్స్
ఈ దీపావళి గిఫ్ట్ బాక్స్‌లో మీకు నచ్చిన ఉత్పత్తిని సెట్ చేసి గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. టీ లైట్ హోల్డర్, బాదం పప్పుతు, క్లే డయాస్, ‘సుభ్ లాభ్’ చిహ్నాలు, వ్యక్తిగతీకరించదగిన కార్డ్‌తో సహా దీపాల పండుగను వ్యక్తికరించే గ్రీటింగ్ కార్డ్స్‌ను ఈ రోజు అందించవచ్చు.
ఇండియన్ కోస్టర్స్
మనతో చాలా స్నేహంగా మెలిగే అత్యంత స్నేహితులకు, ఈ ఇండియన్ కోస్టర్‌లు, హాస్యభరితమైన గృహోపకరణాలు అందించవచ్చు. ఇలాంటివి మహిళలకు చాలా ఆనందాన్ని కలుగజేస్తాయి.
ఫుడ్ కలెక్షన్
డ్రై ఫ్రూట్ గిఫ్ట్ బాక్స్‌ను మీకు నచ్చిన వారికి అందిస్తే వారు చాలా సంతోషంగా ఫీలవుతారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా మంది డైట్ ఫాలో అవుతున్నారు. ఇలాంటి వారికి డ్రైఫ్రూట్ బాక్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీఠాయికు బదులుగా ఖర్జూరంతో పాటు ఇతర పండ్లతో పాటు రకరకాలైన విత్తనాలు, మొక్కల ఆధారిత పొడులు, చాక్లెట్‌లతో ఇవ్వడం చాలా సంతోషాన్ని కలుగజేస్తాయి.
ఐరన్ హ్యాండి బౌల్
ఈ రోజుల్లో అలంకారం అనేది ఇంటి డెకరేషన్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల కాలంలో ఐరన్ హ్యాండిబాల్ సాంప్రదాయ భారతీయ శైలిలో రూపొందించారు. ఇలాంటి ముఖ్యంగా మహిళలను విపరీతంగా ఆకట్టుకుంటాయి.
చాయ్
అందరి రోజు టీపై స్థిరపడి ఉంటుంది. చాలా మంది ఉదయాన్నే లేవగానే టీ తాగకపోతే ఏదో వెలితిగా ఫీలవుతారు. ఈ నేపథ్యంలో టీ ప్రియులకు కొత్త ట్రెండ్‌తో కూడిన టీ పొడి గిఫ్ట్‌గా ఇస్తే చాలా హ్యాపీగా ఫీలవుతారు. అందువల్ల అలాంటి వారికి దీపావళి రోజున టీ గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటుంది.
ముగ్గుల పుస్తకాలు
మహిళలకు ముగ్గులకు విడదీయరానిక అనుబంధం ఉంటుంది. అందువల్ల మీరు ఏలాగో రాబోయేది సంక్రాంతి, న్యూఇయర్ కాబట్టి గిఫ్ట్ ఇచ్చేవారు మహిళలైతు రకరకాల ముగ్గు డిజైన్లను ఉన్న ముగ్గు పుస్తకాలు గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటుంది.
గేమింగ్
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిల్లో స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అందువల్ల వారికి వివిధ గేమింగ్ సబ్‌స్క్రిప్షన్లు ఇస్తే చాలా ఆనందంగా ఫీలవుతారు.
దూప్‌స్టిక్స్
దీపావళి తర్వాత కార్తీకమాసం వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అందువల్ల కార్తీకమసం పూజలకు ఉపయోగపడేలా మంచి అగర్‌బత్తీ కలెక‌్షన్లు దీపావళికి మంచి అగర్‌బత్తీ కలెక‌్షన్లు ఇస్తే చాలా మంది హ్యాపీగా ఫీలవుతారు.