Digestive System: ఆధునిక ప్రపంచంలో ప్రతిఒక్కరూ రుచికరమైన ఆహారానికి అలావాటుపడ్డారు. ముందువెనుక ఆలోచించకుండా తింటూ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా లేకపోతే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఏదైనా కొంచెం ఆహారం తిన్నా గ్యాస్ట్రిక్, అజీర్తి, కడుపునొప్పి, కడుపులో మంట లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం ప్రతి ఒక్కరు ఈ 5 పద్దతులను పాటించాలి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
1. ఫైబర్ పదార్థాలు.. ఫైబర్ ఎక్కువ పదార్థాలున్న ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరును పెంచుకోవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండే పళ్లు, తృణధాన్యాలు, కూరగాయలను తినాలని సూచిస్తున్నారు. వాటివల్ల సులభంగా జీర్ణ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో కరిగే ఫైబర్, కరగని ఫైబర్ అంటూ రెండు రకాలు ఉంటాయి. ఇవి మలబద్ధకం, అతిసారం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను నివారిస్తాయి.
2. నమలడం మర్చిపోవద్దు.. బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది ఆహారాన్ని సరిగ్గా నమలడం లేదు. దీంతో ఆ పదార్థాలు అరగడానికి చాలా సమయం పడుతుంది. ఆరోగ్య కరమైన జీర్ణ వ్యవస్థ కోసం మీరు ఆహారాన్ని మెత్తగా నమలాలి. అప్పుడే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.
3. ఆరోగ్యకరమైన జీవనశైలి మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానం, ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర, ఆహార నియమాలు వంటివి మార్చుకోవాలి.
4. మాంసాహారానికి దూరంగా ఉండాలి.. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది. కొవ్వులు ఎక్కువ లేకుండా ఉండే మాంసం తినాలి. రెడ్ మీట్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది ఇది మలబద్ధకానికి దారి తీస్తుంది. ఇది జరగకుండా ఉండాలంటే ఆహారంలో చికెన్ వంటివి చేర్చాలి.
5. తగినంత నీరు తాగాలి.. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం తరచూ నీరు తాగాలి. ప్రేగు కదలికలను మెరుగుపరచడంలో నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. తద్వారా ఉబ్బరం, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.