AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toothpaste: చీప్‌గా చూడొద్దు.. టూత్‌పేస్ట్‌ చేసే ఈ 5 అద్భుతాల గురించి తెలిస్తే మైండ్ బ్లాంకే..

టూత్‌పేస్ట్‌ను పళ్లు తోముకోవడానికే కాకుండా రోజువారీ చిన్న సమస్యలను పరిష్కరించడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే శుభ్రపరిచే ఏజెంట్ల వల్ల తెల్లటి షూలు, వెండి ఆభరణాలు, బాత్రూమ్ కుళాయిలు, మొబైల్ స్క్రీన్ గీతలను సులభంగా శుభ్రం చేయవచ్చు. అలాగే బట్టలపై పడిన చిన్న మరకలను కూడా తొలగిస్తుంది.

Toothpaste: చీప్‌గా చూడొద్దు.. టూత్‌పేస్ట్‌ చేసే ఈ 5 అద్భుతాల గురించి తెలిస్తే మైండ్ బ్లాంకే..
5 Amazing Toothpaste Hacks Beyond Brushing
Krishna S
|

Updated on: Nov 11, 2025 | 8:05 AM

Share

సాధారణంగా పళ్లను శుభ్రం చేసుకోవడానికి, నోటిని తాజాగా ఉంచుకోవడానికి మాత్రమే టూత్‌పేస్ట్‌ను వాడుతాం. కొందరు కాలిన గాయాలపై కూడా ఉపయోగిస్తారు. అయితే మీ ఇంట్లో ఉండే ఈ టూత్‌పేస్ట్ దంత ఆరోగ్యంతో పాటు మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలోనూ అద్భుతంగా పనిచేస్తుందని మీకు తెలుసా..? టూత్‌పేస్ట్‌లో ఉండే తేలికపాటి శుభ్రపరిచే ఏజెంట్లు, మెంథాల్, బేకింగ్ సోడా వంటి పదార్థాలు మరకలను తొలగించడంలో వస్తువులకు మెరుపు తీసుకురావడంలో, దుర్వాసనను తొలగించడంలో చాలా సహాయపడతాయి. నోటి శుభ్రతకు టూత్‌పేస్ట్ యొక్క ప్రాముఖ్యతతో పాటు మీ పనులను సులభతరం చేసే టూత్‌పేస్ట్ యొక్క 5 ఆశ్చర్యకరమైన ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బూట్లు – స్నీకర్స్ పాలిష్ చేయడానికి

మీ తెల్లటి బూట్లు లేదా స్నీకర్స్‌పై మరకలు పడి మురికిగా కనిపిస్తున్నాయా.. అయితే కొద్దిగా టూత్‌పేస్ట్‌ను అప్లై చేసి బ్రష్‌తో రుద్దితే నిమిషాల్లోనే మీ షూలు వెంటనే కొత్తవాటిలా మెరుస్తాయి.

మొబైల్ గీతలు మాయం:

మీ ఫోన్ స్క్రీన్ లేదా వాచ్‌పై చిన్న గీతలు ఉంటే, టూత్‌పేస్ట్‌ను గుడ్డపై తీసుకుని మెల్లగా రుద్దండి. గీతలు తగ్గి, స్క్రీన్ మెరుస్తుంది.

బాత్రూమ్ అద్దాలు – కుళాయిల శుభ్రతకు

బాత్రూమ్ అద్దాలు, స్టీల్ కుళాయిలపై పేరుకుపోయే నీటి మరకలు, గారను తొలగించడానికి టూత్‌పేస్ట్ బాగా పనిచేస్తుంది. వాటిని టూత్‌పేస్ట్‌తో క్లీన్ చేస్తే మరకలు సులభంగా తొలగిపోతాయి. మళ్లీ కొత్త వాటిలా మెరుస్తాయి.

బట్టల మరకలను తొలగించడానికి

బట్టలపై పెన్ ఇంక్, ఆహారం లేదా చిన్నపాటి నూనె మరకలు పడినప్పుడు టూత్‌పేస్ట్ ఉపయోగపడుతుంది. మరకపై టూత్‌పేస్ట్‌ను పూసి, మెల్లగా బ్రష్‌తో రుద్ది, ఆపై సాధారణ నీటితో కడిగితే, ఆ మరకలు పోతాయి. అయితే ఇది చిన్న తేలికపాటి మరకలకు మాత్రమే పని చేస్తుందని గుర్తుంచుకోవాలి.

వెండి ఆభరణాలను శుభ్రం చేయడానికి

నల్లబడిన వెండి ఆభరణాలు లేదా ఇత్తడి, ఉక్కు పాత్రలకు మెరుపు తీసుకురావడానికి టూత్‌పేస్ట్ దివ్యౌషధంలా పనిచేస్తుంది. నల్లబడిన ఆభరణాలు/పాత్రలపై టూత్‌పేస్ట్‌ను పూసి రుద్దితే, ఆక్సైడ్ పొర తొలగిపోయి.. అవి మళ్లీ కొత్త మెరుపును సంతరించుకుంటాయి.

పళ్ల ఆరోగ్యమే ఫస్ట్

టూత్‌పేస్ట్ యొక్క ఇతర ఉపయోగాలు ఏమైనప్పటికీ.. దాని ప్రధాన ప్రయోజనం దంత ఆరోగ్యాన్ని కాపాడటమే. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం వల్ల దంతాల నుండి ఆహార అవశేషాలు, బ్యాక్టీరియా తొలగిపోతాయి. టూత్‌పేస్ట్‌లో ఉండే ఫ్లోరైడ్ దంతాల ఎనామిల్‌ను బలపరుస్తుంది. తద్వారా క్షయాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ పదార్థాలు నోటి ఇన్ఫెక్షన్లు, చిగుళ్ల వాపు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అందువల్ల, మీ టూత్‌పేస్ట్‌ను ఇంటి శుభ్రతకు ఉపయోగిస్తూనే, సరైన బ్రష్‌తో రోజుకు రెండుసార్లు దంతాలను శుభ్రం చేసుకోవడం తప్పనిసరి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..