AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year Diet Plan: ఏడాది పొడవునా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..? వీటిని అలవాటు చేసుకోండి..

కొత్త సంవత్సరం ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? నేటి బిజీ జీవనశైలిలో ఆరోగ్యంగా ఉండటం కష్టమైనప్పటికీ, సరైన ఆహార ఎంపికలతో ఇది సాధ్యమే. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, శుద్ధి చేసిన ధాన్యాలను వదిలేసి, సహజమైన, పౌష్టిక ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి. ఇది మిమ్మల్ని ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉంచి, వ్యాధులను దూరం చేస్తుంది.

New Year Diet Plan: ఏడాది పొడవునా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..? వీటిని అలవాటు చేసుకోండి..
New Year Diet Plan
Jyothi Gadda
|

Updated on: Dec 24, 2025 | 10:10 AM

Share

2025కు వీడ్కోలు పలికేందుకు యావత్‌ ప్రపంచం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ సంవత్సరానికి వీడ్కోలుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, నేటి బిజీ జీవితాల్లో మనల్ని మనం కాపాడుకోవడం చాలా కష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన జీవితాల్లో మనం మన ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తాము. అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం అలవాటుగా చేసుకుంటున్నాము. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, ఈ రోజు మనం మీ ఆహారం నుండి ఎలాంటి ఫుడ్స్‌ తొలగించాలో, ఎలాంటి ఆహార పదార్థాలను చేర్చుకోవాలో తెలుసుకుందాం..ఇది మీరు ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ప్రాసెస్డ్ ఫుడ్ వ్యసనం:

నేటి బిజీ లైఫ్‌ కారణంగా అందరి దగ్గర టైమ్‌ చాలా తక్కువగా ఉంది. దీంతో సమయాన్ని ఆదా చేయడానికి చాలా మంది ప్రాసెస్ చేసిన ఆహారాలకు ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. కానీ, ఇది ఒక పెద్ద తప్పు, ఎందుకంటే ఈ ఆహారాలలో ప్రిజర్వేటివ్‌లు, రసాయనాలు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి నెమ్మదిగా హాని కలిగిస్తాయి. అందువల్ల, వచ్చే ఏడాది ఆరోగ్యంగా ఉండటానికి ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించాలని నిర్ణయించుకోండి. బదులుగా, మీరు సహజమైన ఆహారాన్ని తీసుకోండి. ఇది మీ శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యాధులను నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్యాక్ చేసిన జ్యూస్:

చాలా మంది ప్రతిరోజు ఉదయం మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన జ్యూస్‌లను తాగుతారు. కానీ, ఈ ప్యాక్ చేసిన జ్యూస్‌లను ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి, ఇతర కారణాల వల్ల కొన్ని ప్రిజర్వేటివ్‌లను కలుపుతారని మీకు తెలుసా..? ఇవి ఆరోగ్యానికి హానికరం. అందుకే ఈ నూతన సంవత్సరం నుండి వాటిని తీసుకోవడం మానేయాలి. బదులుగా మీ ఆహారంలో తాజా పండ్లు, డ్రైఫ్రూట్స్‌ని చేర్చుకోండి. ఇవి శరీరానికి సమృద్ధిగా పోషకాలను అందిస్తాయి. వ్యాధులను దూరంగా ఉంచుతాయి. నిమ్మకాయ నీరు, కొబ్బరి నీటిని ఎక్కువగా తీసుకోవచ్చు.

బ్రెడ్, పాస్తా, బిస్కెట్లు:

బ్రెడ్, పాస్తా, బిస్కెట్లు, ఇతర వాణిజ్యపరంగా లభించే వస్తువులలో ఎక్కువగా శుద్ధి చేసిన పిండి, ప్రాసెస్ చేసిన ధాన్యాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా హానికరం. అందువల్ల, వీటిని తీసుకోవడం వెంటనే మానేయండి. ఎందుకంటే అవి వివిధ జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. బదులుగా, మీరు మిల్లెట్, రాగులు, జొన్నలు,ఇతర తృణధాన్యాలతో తయారు చేసిన స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇది అనేక అనారోగ్య సమస్యలను తగ్గించి, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను కాపాడుతుంది.

సాస్‌లు, డిప్స్:

మార్కెట్లో లభించే బాటిల్ సాస్‌లు, డిప్‌ఫ్రై వంటి ఆహారాలు నోటికి రుచికరంగా ఉంటాయి. కానీ, అవి ఆరోగ్యానికి చాలా హానికరం. వాటిలో అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర, ఆయిల్‌ వంటిది ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. బదులుగా, మీరు ఇంట్లో పుదీనా, టమోటా చట్నీ తయారు చేసి తినవచ్చు. ఇది రుచిని పెంచడమే కాకుండా మీ జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

ప్రాసెస్ చేసిన స్నాక్స్:

చాలా మంది సాయంత్రం స్నాక్స్ కోసం మార్కెట్లో లభించే ఉప్పు, రుచిగల గింజలను తీసుకుంటారు. ఇది హానికరం కావచ్చు. బదులుగా, మీరు జీడిపప్పు, బాదం, పప్పు, శనగలు, ఇతర డ్రై ఫ్రూట్స్ వంటివి తినవచ్చు. ఇవి మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..