కరోనా కట్టడికి.. జైడ‌స్ డ్ర‌గ్ ‘రెమ్‌డాక్ ‘.. ధ‌ర రూ.2800!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాలన్ని ఈ వైరస్ కట్టడికి వ్యాక్సిన్ కనుగొనే దిశగా తలమునకలై ఉన్నాయి. ఈ క్రమంలో జైడ‌స్ క్యాడిలా కంపెనీ మార్కెట్లోకి క‌రోనా వైర‌స్

కరోనా కట్టడికి.. జైడ‌స్ డ్ర‌గ్ 'రెమ్‌డాక్ '.. ధ‌ర రూ.2800!
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2020 | 11:51 AM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాలన్ని ఈ వైరస్ కట్టడికి వ్యాక్సిన్ కనుగొనే దిశగా తలమునకలై ఉన్నాయి. ఈ క్రమంలో జైడ‌స్ క్యాడిలా కంపెనీ మార్కెట్లోకి క‌రోనా వైర‌స్ ఔష‌ధాన్ని రిలీజ్ చేసింది. యాంటీ వైర‌ల్ డ్ర‌గ్ రెమ్డిసివిర్‌ను ఇండియాలో రిలీజ్ చేశారు. 100మిల్లీగ్రాములు ఆ డ్ర‌గ్‌ ధ‌ర‌ను రూ.2800గా ఫిక్స్ చేశారు. రెమ్‌డాక్ బ్రాండ్ పేరుతో ఆ ఔష‌ధాన్ని అమ్మ‌నున్నారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో కోవిడ్ చికిత్స పొందుతున్న వారికి ఈ ఔష‌ధాన్ని ఇవ్వ‌నున్నారు.

భారత్ లో పంపిణీ స‌రిగా లేద‌ని కొన్ని రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి. అయితే ఔష‌ధాల స‌ర‌ఫ‌రాను క్ర‌మ‌బ‌ద్దీక‌రించిన‌ట్లు సిప్లా కంపెనీ పేర్కొన్న‌ది. యాంటీ వైర‌ల్ మందును ఇండియాలో రిలీజ్ చేసిన అయిద‌వ కంపెనీగా జైడ‌స్ నిలిచింది. గిలీడ్ సైన్సెస్‌తో డాక్ట‌ర్ రెడ్డీస్ లాబ‌రేట‌రీస్‌, సింజీన్ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్ సంస్థ‌లు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. 127 దేశాల్లో రెమ్డిసివిర్ ఔష‌ధాన్ని స‌ర‌ఫ‌రా చేసేందుకు అంగీకారం చేసుకున్నాయి.

Read More:

హెల్మెట్‌లకు బీఐఎస్‌ లేకుంటే ఇక బాదుడే!

అక్కడి మెడికల్‌ కళాశాలల డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ