ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ హెల్త్ కండిష‌న్‌పై స్పందించిన ఆయ‌న కుమారుడు

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ హెల్త్ కండిష‌న్‌పై స్పందించిన ఆయ‌న కుమారుడు

మాజీ రాష్ట్ర ప‌తి, ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్య ప‌రిస్థితిపై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న హెల్త్ కండీష‌న్‌పై సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న వార్త‌ల‌ను ప్ర‌ణ‌బ్ కుమారుడు అభిజిత్ ఖండించారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే త‌ప్పుడు వార్త‌ల‌ను..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 13, 2020 | 11:43 AM

మాజీ రాష్ట్ర ప‌తి, ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్య ప‌రిస్థితిపై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న హెల్త్ కండీష‌న్‌పై సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న వార్త‌ల‌ను ప్ర‌ణ‌బ్ కుమారుడు అభిజిత్ ఖండించారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే త‌ప్పుడు వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని తెలిపారు. ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు మాత్ర‌మేన‌ని, త‌మ తండ్రి ప్ర‌స్తుతం కోలుకుంటున్నార‌ని ట్వీట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం త‌న తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉంద‌ని, ఆయ‌న కోసం మీప్రార్థ‌న‌ల‌ను కొన‌సాగించండి అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు ప్ర‌ణ‌బ్ కుమారుడు అభిజిత్ ముఖ‌ర్జీ.

అయితే తాజాగా ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు.. ఆర్మీ ఆస్ప‌త్రి వ‌ర్గాలు ఇప్ప‌టికే హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు. ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌వ్యంగానే సాగుతోంద‌ని, వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తున్నామ‌ని, ప్ర‌త్యేక నిపుణుల బృందం ప్ర‌ణ‌బ్ ఆరోగ్య ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని ప్ర‌క‌టించింది. ఇక మెద‌డులో ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌డంతో ఈ నెల 10న ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి శ‌స్త్ర చికిత్స జ‌రిగిన విష‌యం తెలిసిందే. అదే రోజు ఆయ‌న‌కు కోవిడ్ టెస్ట్ చేయ‌గా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు వైద్యులు పేర్కొన్నారు.

Read More:

ఈ రోజు రాత్రి 8 గంట‌ల‌కు మెగా డాట‌ర్‌ నిహారిక నిశ్చితార్థం‌

బిగ్‌బాస్ సీజ‌న్-4 లేటెస్ట్ ప్రోమోః నెక్ట్స్ ఏం జ‌రుగుతుందో?

ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వ హెచ్చ‌రిక

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu