మోహన్ బాబుకు లీగల్ నోటీసులు పంపిన వైవిఎస్ చౌదరి

సినీ నటుడు మోహన్ బాబుకు, డైరెక్టర్ వైవిఎస్ చౌదరికు మధ్య గత కొద్దిరోజులుగా వైరం జరుగుతున్న సంగతి తెలిసిందే. సలీం సినిమా సమయంలో ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని చౌదరి 2010 లో కేసు దాఖలు చేయగా, రీసెంట్ గా దీనిపై కోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి అనుగుణంగా నెల రోజుల్లో మోహన్ బాబు డబ్బు చెల్లించాలి. ఇక ఇది ఇలా ఉంటే వీరి మధ్య మరో కొత్త ఇష్యు ఇప్పుడు తెరమీదకు వచ్చింది. రంగారెడ్డి లోని […]

మోహన్ బాబుకు లీగల్ నోటీసులు పంపిన వైవిఎస్ చౌదరి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 09, 2019 | 7:20 PM

సినీ నటుడు మోహన్ బాబుకు, డైరెక్టర్ వైవిఎస్ చౌదరికు మధ్య గత కొద్దిరోజులుగా వైరం జరుగుతున్న సంగతి తెలిసిందే. సలీం సినిమా సమయంలో ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని చౌదరి 2010 లో కేసు దాఖలు చేయగా, రీసెంట్ గా దీనిపై కోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి అనుగుణంగా నెల రోజుల్లో మోహన్ బాబు డబ్బు చెల్లించాలి.

ఇక ఇది ఇలా ఉంటే వీరి మధ్య మరో కొత్త ఇష్యు ఇప్పుడు తెరమీదకు వచ్చింది. రంగారెడ్డి లోని సరూర్ నగర్ లో వైవిఎస్ చౌదరి కొంత భూమిని ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు.  ఆ ప్రాంతంలోనే మోహన్ బాబు కూడా కొంతభూమిని కొనుగోలు చేశారు. మోహన్ బాబు కొనుగోలు చేసిన భూమిలో ఇంటిని నిర్మించుకోగా, వైవిఎస్ చౌదరి మాత్రం భూమిని అలాగే ఖాళీగా ఉంచారని తెలుస్తోంది. అయితే కొన్ని రోజుల క్రితం సలీం విషయంలో జరిగిన గొడవల కారణంగా సరూర్ నగర్ లోని తన స్థలంలోకి తనను అనుమతించడంలేదని, బౌన్సర్లను పెట్టి అడ్డుకుంటున్నారని చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇందుకు గానూ ఆయన మోహన్ బాబుకు లీగల్ నోటీసులు పంపించారు.  వారం రోజుల్లోగా రిప్లయ్ ఇవ్వాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆ నోటీస్‌లో ఆయన పేర్కొన్నారు.