నక్సలైట్ల దాడిలో బీజేపీ ఎమ్మెల్యే మృతి
ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు హింసకు పాల్పడ్డారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ను బహిష్కరించాలని కొంతకాలంగా ప్రకటనలు జారీచేస్తున్న నక్సలైట్లు..తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. దంతెవాడ శాసనసభ్యుడు భీమా మండావి సహా మరో ఐదుగురిని బలిగొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే భీమా మండావి వాహనం కువకొండ నుంచి బచేలివైపు వెళ్తుండగా నక్సలైట్లు దాడికి తెగబడ్డారు. శ్యామగిరి పర్వతాల సమీపంలో డేంజరస్ ఐఈడీ పేల్చారు. ఈ దాడిలో ఎమ్మెల్యే, ఐదుగురు భద్రతా సిబ్బంది అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే భద్రతా […]

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు హింసకు పాల్పడ్డారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ను బహిష్కరించాలని కొంతకాలంగా ప్రకటనలు జారీచేస్తున్న నక్సలైట్లు..తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. దంతెవాడ శాసనసభ్యుడు భీమా మండావి సహా మరో ఐదుగురిని బలిగొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే భీమా మండావి వాహనం కువకొండ నుంచి బచేలివైపు వెళ్తుండగా నక్సలైట్లు దాడికి తెగబడ్డారు. శ్యామగిరి పర్వతాల సమీపంలో డేంజరస్ ఐఈడీ పేల్చారు. ఈ దాడిలో ఎమ్మెల్యే, ఐదుగురు భద్రతా సిబ్బంది అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే భద్రతా బలగాలతో ఘటనా స్థలాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశలో బస్తర్ స్థానానికి గురువారం పోలింగ్ జరగనుంది. అందుకు కొద్ది గంటల ముందు అదే నియోజకవర్గం పరిధిలోని దంతెవాడ శాసనసభ్యుడ్ని నక్సలైట్లు హత్యచేయడం కలకలం రేపింది.
Pictures from Dantewada ambush site pic.twitter.com/7q4f5X1mtx
— Rahul Pandita (@rahulpandita) April 9, 2019




