CBN-Vijay Sai Reddy: రాజకీయం వేరు… బంధుత్వం వేరు.. పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్న చంద్రబాబు, సాయి రెడ్డి

నందమూరి కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. తారకరత్న ఇకలేరనే వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు..23రోజులు మృత్యువుతో పోరాడిన తారకరత్న..కోలుకొని తిరిగివస్తాడని ఆశతో ఎదురుచూశారు. కానీ ఇలా తిరిగిరానిలోకాలకు వెళ్లిపోవడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు.

CBN-Vijay Sai Reddy: రాజకీయం వేరు... బంధుత్వం వేరు.. పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్న చంద్రబాబు, సాయి రెడ్డి
Vijay Sai Redy -Chandrababu
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 19, 2023 | 12:24 PM

— రాజకీయం వేరు. కష్టకాలంలో ఆత్మీయత చూపించడం వేరు. తారకరత్న మరణం సందర్భంగా ఇవాళ ఇలాంటి దృశ్యమే కనిపించింది. టీడీపీ అధినేత చంద్రబాబు– YCP ఎంపీ విజయసాయిరెడ్డి ఇద్దరూ తారకరత్న కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. రాజకీయంగా ఇద్దరి దారులూ వేరయినా.. బంధుత్వం పరంగా తారకరత్న మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

– తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి.. YCP ఎంపీ విజయసాయిరెడ్డికి వరుసకు కూతురు అవుతారు. బాగా దగ్గరి బంధువు. అందుకే.. తారకరత్నను బెంగళూరు ఆస్పత్రికి తరలించారని తెలియగానే సాయిరెడ్డి అక్కడికి వెళ్లి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడారు. బాలకృష్ణ తీసుకుంటున్న ప్రత్యేక కేర్‌కి కృతజ్ఞతలు చెప్పారు. ఇక ఇవాళ తారకరత్నకు నివాళులు అర్పించేందుకు వచ్చిన సమయంలో జూనియర్‌ NTR, కల్యాణ్‌రామ్‌తోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. కాసేపటికి చంద్రబాబు రావడంతో ఆయనతోనూ మాట్లాడారు.

– నందమూరి తారకరత్నకు టీడీపీ అధినేత చంద్రబాబు మావయ్య అవుతారు. అటు ఆలేఖ్య రెడ్డి తరపున విజయసాయిరెడ్డి కూడా మావయ్యే అవుతారు. ఈ బంధుత్వం లెక్కన చూస్తే చంద్రబాబు-విజయసాయిరెడ్డి వరసకు సోదరులు అవుతారు. తారకరత్నకు నివాళులు అర్పించిన సందర్భంలో ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం ఇక్కడ ప్రత్యేకంగా కనిపించింది. రాజకీయాలపరమైన వైరం ఉన్నా.. కుటుంబ వ్యవహారం కావడంతో తారకరత్న ఫ్యామిలీ విషయంపై ఇద్దరూ మాట్లాడుకున్నారని తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!