ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..ఏడాది పాల‌న‌పై మేధోమథనం

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్తయిన సంద‌ర్భంగా.. నేటి నుంచి మే 30 తేదీ వరకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని స‌ర్కార్ డిసైడ‌య్యింది. ‘మన పాలన- మీ సూచన పేరుతో మేధోమథన కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ‘పరిపాలన–సంక్షేమం’, ‘గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ’పై చర్చించారు. ఈ కార్యక్రమంలో సీఎం జ‌గ‌న్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన‌ ఈ కార్యక్రమం జిల్లాలకు […]

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..ఏడాది పాల‌న‌పై మేధోమథనం
Follow us

|

Updated on: May 25, 2020 | 4:36 PM

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్తయిన సంద‌ర్భంగా.. నేటి నుంచి మే 30 తేదీ వరకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని స‌ర్కార్ డిసైడ‌య్యింది. ‘మన పాలన- మీ సూచన పేరుతో మేధోమథన కార్యక్రమం నిర్వహించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ‘పరిపాలన–సంక్షేమం’, ‘గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ’పై చర్చించారు. ఈ కార్యక్రమంలో సీఎం జ‌గ‌న్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన‌ ఈ కార్యక్రమం జిల్లాలకు లైవ్ టెలికాస్ట్​ను ప్రసారం చేశారు. జిల్లా మంత్రులు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహించాలని ఏపీ స‌ర్కార్ నిర్ణయం తీసుకుంది. 25న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, 26న వ్యవసాయ సంబంధిత రంగాలు, 27న విద్యారంగంలో కీల‌క మార్పులు , 28 న మౌలిక సదుపాయాలు, నైపుణ్యం, గృహనిర్మాణం, 29న ఆరోగ్యం వంటి అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నెల 30 తేదీన సీఎం జగన్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించనున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో 50 మందికి మించి హాజరు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

తొలిరోజు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం గ్రామ వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటి వద్దకే సేవలు అందిస్తున్నామని ఆనందం వ్య‌క్తం చేశారు. ప్రతి 2 వేల జనాభా కలిగిన గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని 11,162 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశామని వెల్ల‌డించారు. లక్షా 35 వేలమందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘ‌న‌త‌ బహుశా మ‌రెక్క‌డ‌ ఉండదేమోనని జగన్ అభిప్రాయ‌ప‌డ్డారు. 82.5 శాతం ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలే ఉన్నార‌ని వివ‌రించారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు, సేవలు చేరువ చేస్తున్నామ‌న్న‌ సీఎం… అవినీతి లేని గొప్ప వ్యవస్థను తయారు చేశామన్నారు.

సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్.. "మై డియర్ దొంగ" ట్రైలర్ విడుదల..
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్..