ఏడాదిలోపు మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా: వైఎస్ జగన్
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గెలుపు దాదాపు ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తరువాత రెండో సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్న జగన్.. తనను ఇంతగా ఆదరించిన ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆరెళ్ల నుంచి సంవత్సరంలోపు మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చకుంటా. అన్ని ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నాం. రాష్ట్ర చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం. ప్రజలు మంచి గవర్నెన్స్ కోసం ఓటేశారు. ఈ విజయం దేవుడి దయతో, ప్రజల ఆశీస్సులతో సాధ్యమైంది. […]
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గెలుపు దాదాపు ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తరువాత రెండో సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్న జగన్.. తనను ఇంతగా ఆదరించిన ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతున్నారు.
- ఆరెళ్ల నుంచి సంవత్సరంలోపు మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చకుంటా.
- అన్ని ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నాం.
- రాష్ట్ర చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం.
- ప్రజలు మంచి గవర్నెన్స్ కోసం ఓటేశారు.
- ఈ విజయం దేవుడి దయతో, ప్రజల ఆశీస్సులతో సాధ్యమైంది.
- నవరత్నాలే అమలే నా తొలి బాధ్యత.
- నా విజయంలో ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతఙ్ఞతలు
- రాజకీయంలో ఇంత గొప్ప విజయం ఎప్పుడూ సాధ్యం కాలేదు.
- నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రామిస్ చేస్తున్నా.
- ఈ విజయంతో నాపై మరింత బాధ్యత పెరిగింది.
- ఈ నెల 30న విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తా.