వెర్రి వెయ్యి రకాలు..అక్కను ప్రేమించి, ఆమె చెల్లిని వేధించాడు
మనుషుల ఆలోచనాధోరణిలో విపరీతమైన మార్పు వస్తోంది. నెగిటివిటీ రోజురోజకూ పెరిగిపోతుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో, ప్రేమించిన అమ్మాయి చెల్లిని టార్గెట్ చేశాడు ఓ యువకుడు. అందుకోసం టెక్నాలజీని కూడా ఉపమోగించాడు. చిరవకు పోలీసులకు దొరికిపోయి చిప్ప కూడు తింటున్నాడు. వివరాల్లోకి వెళితే…నిజాంపేటలో నివశించే కోట్ల మాధవరావు డిగ్రీ కంప్లీట్ చేసి నగరంలోని ఓ ప్రవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నాలుగేండ్ల క్రితం మాధవరావు…తన స్నేహితురాలు వద్దకు వెళ్లి ప్రేమిస్తున్నాను, పెండ్లి చేసుకుంటానని చెప్పాడు. అతడిపై అలాంటి […]
మనుషుల ఆలోచనాధోరణిలో విపరీతమైన మార్పు వస్తోంది. నెగిటివిటీ రోజురోజకూ పెరిగిపోతుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో, ప్రేమించిన అమ్మాయి చెల్లిని టార్గెట్ చేశాడు ఓ యువకుడు. అందుకోసం టెక్నాలజీని కూడా ఉపమోగించాడు. చిరవకు పోలీసులకు దొరికిపోయి చిప్ప కూడు తింటున్నాడు.
వివరాల్లోకి వెళితే…నిజాంపేటలో నివశించే కోట్ల మాధవరావు డిగ్రీ కంప్లీట్ చేసి నగరంలోని ఓ ప్రవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నాలుగేండ్ల క్రితం మాధవరావు…తన స్నేహితురాలు వద్దకు వెళ్లి ప్రేమిస్తున్నాను, పెండ్లి చేసుకుంటానని చెప్పాడు. అతడిపై అలాంటి ఫీలింగ్ లేదంటూ సదరు యువతి మాధవరావుని దూరం పెట్టసాగింది. దీంతో కక్ష పెంచుకున్న అతడు, ప్రేమించిన అమ్మాయి చెల్లెలిని టార్గెట్ చేశాడు. ఆమె ఫోన్ నెంబర్‌కు అసభ్యకర మెసేజ్‌లు పంపడం స్టార్ట్ చేశాడు. అనుమానం రాకుండా వాట్పాప్‌ను ఇంటర్నేషనల్ నెంబర్‌కు లింక్ చేసుకుని మరీ ఈ తంతు కొనసాగించాడు. బ్లాక్ చేసినా కూడా కొత్త, కొత్త నెంబర్లు నుంచి మెసేజ్‌లు రావడంతో విసిగిపోయిన యువతి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. టెక్నాలజీ సాయంతో నిందితుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read More : హైపర్ ఆది నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు..?