AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువకుడిపై గంజాయి గ్యాంగ్ దాడి

గంజాయి మత్తులో కొందరు యువకులు నడిచి వెళ్తున్న వ్యక్తిపై కత్తితో దాడి

యువకుడిపై గంజాయి గ్యాంగ్ దాడి
Balaraju Goud
|

Updated on: Jun 01, 2020 | 6:13 PM

Share

తిరుపతిలో కొందరు యువకులు గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. ఒంటరిగా నడిచి వెళ్తున్నవారే టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. తాజాగా యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. గంజాయి మత్తులో కొందరు యువకులు అతనిపై కత్తితో దాడి చేశారు. వెంటనే గమనించిన స్థానికులు అతడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిత్తూరు జిల్లాలో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. స్థానిక తాతయ్యగుంటకు చెందిన కొందరు యువకులు గంజాయి సేవించి దారినపోయే ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. కత్తితో వెంకటసాయి అనే యువకుడిపై దాడికి దిగారు.  తీవ్రంగా గాయపడ్డ యువకుడిని స్థానికులు రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు షరా మామూలు అయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు గస్తీ ఏర్పాటు చేసి వారిని కట్టడి చేయాలని కోరుతున్నారు. వెంకటసాయిపై దాడికి పాల్పడిన ఆరుగురు యువకులపై తిరుపతి ఈస్ట్ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us
43 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కుప్పకూలిన బంగారం, వెండి
43 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కుప్పకూలిన బంగారం, వెండి
ఎలిఫెంట్ క్యాంప్‌లో ఘనంగా గున్న ఏనుగు పుట్టినరోజు వేడుకలు
ఎలిఫెంట్ క్యాంప్‌లో ఘనంగా గున్న ఏనుగు పుట్టినరోజు వేడుకలు
వేసవిలో పెరుగు త్వరగా పులిసిపోతుందా? ఇలా చేయండి.. బెస్ట్‌ ట్రిక్
వేసవిలో పెరుగు త్వరగా పులిసిపోతుందా? ఇలా చేయండి.. బెస్ట్‌ ట్రిక్
హైదరాబాద్ కల్చర్ ను గొప్పగా చూపించే సినిమా ఇది: దిల్ రాజు
హైదరాబాద్ కల్చర్ ను గొప్పగా చూపించే సినిమా ఇది: దిల్ రాజు
అతి చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ తోపు హీరోయిన్స్ వీరే!
అతి చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ తోపు హీరోయిన్స్ వీరే!
నాడు ఐపీఎల్ ప్లేయర్‌గా ఎంట్రీ.. నేడు ఆర్సీబీకి ఓనర్‌గా రీఎంట్రీ..
నాడు ఐపీఎల్ ప్లేయర్‌గా ఎంట్రీ.. నేడు ఆర్సీబీకి ఓనర్‌గా రీఎంట్రీ..
నా అక్షరానికి వెలకట్టి చెల్లించిన ఏకైక హీరో.. శ్రీశ్రీ ఆసక్తికర క
నా అక్షరానికి వెలకట్టి చెల్లించిన ఏకైక హీరో.. శ్రీశ్రీ ఆసక్తికర క
ఇది ప్రపంచంలోనే అరుదైన గ్రామం.. మేఘాలపైన గ్రామం.. వర్షమే పడదు!
ఇది ప్రపంచంలోనే అరుదైన గ్రామం.. మేఘాలపైన గ్రామం.. వర్షమే పడదు!
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్..నగరాల్లో తక్కువ ధరకే హాస్టల్స్‌
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్..నగరాల్లో తక్కువ ధరకే హాస్టల్స్‌
నిరుద్యోగులకు TGPSC హెచ్చరిక.. OTR అప్‌డేట్‌కు నేడే ఆఖరి ఛాన్స్
నిరుద్యోగులకు TGPSC హెచ్చరిక.. OTR అప్‌డేట్‌కు నేడే ఆఖరి ఛాన్స్