మీ ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయ్యిందా? ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా సులువుగా చేసేయండిలా..
ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు మన జీవితంలో ముఖ్యం అయిపోయింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఎప్పటికప్పుడు దీనిని అప్ డేట్ చేస్తోంది.

Phone Number Link Wiht Aadhar Card: ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు మన జీవితంలో ముఖ్యం అయిపోయింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఎప్పటికప్పుడు దీనిని అప్ డేట్ చేస్తోంది. అంతేకాకుండా ఆధార్ కార్డులో మార్పులు, స్టేటస్ అప్ డేట్ చేయడం సులభతరం చేసింది. ఇప్పటివరకు మన ఆధార్ కార్డులో చాలా మార్పులు తీసుకువచ్చింది. అలాగే వాటికి ఫోన్ నంబరు లింక్ చేయకపోతే.. ఎక్కడివెళ్ళిన మీ పని జరగదు. ఏక్కడైనా ఆధార్ కార్డు ఉపయోగించాలంటే.. తప్పనిసరిగా ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే గతంలో ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్నా ఫోన్ నంబర్లను కూడా ప్రస్తుతం మార్చుకోవచ్చు.
తాజాగా UIDAI ఆధార్ కార్డులో సరికొత్త అప్ డేట్ తీసుకువచ్చింది. దీంతో ఫోన్ నంబరును సులభంగా ఆధార్ కార్డుకు అనుసంధానం చేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ యాడ్ చేయడం లేదా అప్ డేట్ చేయడం ఇప్పుడు సులభం.
ఫోన్ నంబర్ లింక్ ఎలా చేయాలి ? మీ ఫోన్ నంబరును ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి ఇక నుంచి ఆధార్ సెంటర్కు వెళ్ళాలి. సులభంగా ఆన్లైన్లో మీ ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ అయ్యిందా ? లేదా అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఆన్ లైన్లో మీకు సమీపంలోని ఆధార్ సెంటర్లో అపాయింంట్ మెంట్ తీసుకునే సదుపాయాన్ని కూడా కల్పించింది. ఆ ఆధార్ సెంటర్లో మీ నంబర్ అప్ డేట్ చేయాలి. తాజాగా UIDAI విడుదల చేసిన రూల్స్ ప్రకారం మొబైల్ నంబరును ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి ఎలాంటి పత్రాలు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ సెంటర్లో మీ ఫోన్ నంబరును లింక్ చేసుకోవడానికి కేవలం రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. వెంటనే మీ ఆధార్ కార్డుకు మీ మొబైల్ నంబర్ లింక్ అవతుంది.
#UpdateMobileInAadhaar Adding a mobile number to Aadhaar doesn’t require any document. Just carry your Aadhaar to any nearby Aadhaar Center to place an add/update mobile number request. Find your nearest Aadhaar Center here https://t.co/dtBtCH8Wqa pic.twitter.com/NpaBUBWsQy
— Aadhaar (@UIDAI) January 25, 2021