మెగా హీరో కోసం అతిధిగా వస్తోన్న కన్నడ స్టార్ హీరో ? ఆ సినిమాలో కీలక పాత్రలో నటించనున్న..
మెగా హీరో వరుణ్ తేజ్, కిరణ్ కొర్రపాటి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 'గని'. గతంలో విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్
మెగా హీరో వరుణ్ తేజ్, కిరణ్ కొర్రపాటి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘గని’. గతంలో విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.
వరుణ్ నటిస్తున్న ‘గని’ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అతిధి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇక ఫిబ్రవరి 12న ఉపేంద్ర ఈ సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఆ పాత్రలో నటించడానికి ఉపేంద్ర సంతోషంగా అంగీకరించినట్లుగా సమాచారం. ఇక ఈ మూవీని సిద్దు మరియు అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గని సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. బాక్సింగ్ స్పోర్ట్స్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇక ఈ మూవీ జూలై 30న థియేటర్లలోకి రానుంది.
Also Read:
Bigg Boss: ‘అతడితో ప్రేమలో ఉన్నాను’.. లవ్ మ్యాటర్‌ను బయటపెట్టిన బిగ్‌బాస్ కంటెస్టెంట్..