‘కొద్దిమంది ఎమ్మెల్యేలను కొంటారు, కానీ తృణమూల్ కాంగ్రెస్ ను కొనలేరు’ అమిత్ షా పై బెంగాల్ సీఎం మమత ఫైర్

కొద్ధి మంది ఎమ్మెల్యేలను, అది కూడా 'కుళ్ళిన స్థితిలో' ఉన్నవారిని మీరు కొనగలుగుతారని, కానీ తృణమూల్ కాంగ్రెస్ ను కొనజాలరని బెంగాల్ సీఎం, ఈ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి ఆమె ఇలా తీవ్రంగా  వ్యాఖ్యానించారు.

'కొద్దిమంది ఎమ్మెల్యేలను కొంటారు, కానీ తృణమూల్ కాంగ్రెస్ ను కొనలేరు' అమిత్ షా పై బెంగాల్ సీఎం మమత ఫైర్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 29, 2020 | 8:05 PM

కొద్ధి మంది ఎమ్మెల్యేలను, అది కూడా ‘కుళ్ళిన స్థితిలో’ ఉన్నవారిని మీరు కొనగలుగుతారని, కానీ తృణమూల్ కాంగ్రెస్ ను కొనజాలరని బెంగాల్ సీఎం, ఈ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి ఆమె ఇలా తీవ్రంగా  వ్యాఖ్యానించారు. సరిగ్గా వారం రోజుల క్రితమే అమిత్ షా ఈ రాష్ట్రానికి వచ్చి..బోల్ పూర్ లో జరిగిన రోడ్ షో, భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా టీ ఎం సీ ని, మమతా బెనర్జీని తీవ్రంగా విమర్శించారు. కాగా-మంగళవారం మమత ఇదే బోల్ పూర్ లో జరిగిన మెగా ర్యాలీలో పాల్గొన్నారు. తమ పార్టీకి చెందిన మాజీ నేత సువెందు అధికారి సహా సుమారు 10 మంది నేతలు ఇటీవల బీజేపీలో చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావిస్తూ.. ఇలా మా వాళ్ళను కొన్నంత మాత్రాన మా పార్టీకి వఛ్చిన నష్టం ఏమీ లేదన్నారు. బీజేపీని బయటి పార్టీగా అభివర్ణిస్తూ..మీరు ఫేక్ పాలిటిక్స్, హేట్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నారని, కానీ మీ పప్పులుడకవని వ్యాఖ్యానించారు. బెంగాల్ వెన్నును చీల్చడానికి మీరు యత్నిస్తున్నారు..కానీ రవీంద్ర నాథ్ ఠాగూర్ ‘సోనార్ బంగ్లా’ గా పేర్కొన్న ఈ రాష్టంలో మీ ఆటలు సాగబోవు అని మమత అన్నారు.మహాత్మా గాంధీ, ఇతర దేశ నాయకుల పట్ల గౌరవం చూపని వ్యక్తులు’సోనార్ బంగ్లా’ గురించి మాట్లాడుతున్నారు.. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ భూభాగాన్ని ఇదివరకే సోనార్ బంగ్లాగా జాతీయ గీతంలో అభివర్ణించారు అని దీదీ పేర్కొన్నారు. విశ్వభారతి యూనివర్సిటీలో మతతత్వ రాజకీయాలను జొప్పించేందుకు జరుగుతున్న యత్నాల పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ యూనివర్సిటీ వీసీ బిద్యుత్ చక్రవర్తిని ఆమె బీజేపీ రబ్బర్  స్టాంప్ గా దుయ్యబట్టారు. కోల్ కతాకు 150 కి.మీ. దూరంలోని ఈ యూనివర్సిటీ వద్ద నేడు నాలుగు కి.మీ. పొడవునా సాగిన రోడ్ షో లో ఆమె పాల్గొన్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..