AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Treasure Hunt : వికారాబాద్‌లో గుప్త నిధుల కలకలం.. బంగారు గణపతి విగ్రహం లభ్యం..సీన్‌లోకి పోలీసులు

వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని గుండాల గ్రామంలో గుప్త నిధుల కలకలం రేగింది. ఓ రైతు పొలంలో తవ్వకాలు జరుపగా.. బంగారు గణపతి విగ్రహం లభ్యమైంది.

Treasure Hunt : వికారాబాద్‌లో గుప్త నిధుల కలకలం.. బంగారు గణపతి విగ్రహం లభ్యం..సీన్‌లోకి పోలీసులు
Ram Naramaneni
|

Updated on: Dec 29, 2020 | 7:19 PM

Share

Treasure Hunt :  వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని గుండాల గ్రామంలో గుప్త నిధుల కలకలం రేగింది. ఓ రైతు పొలంలో తవ్వకాలు జరుపగా.. బంగారు గణపతి విగ్రహం లభ్యమైంది. కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా గమనించిన స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తవ్వకాలలో దొరికిన బంగారు గణపతి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిందితులంతా పోలీసుల అదుపులోనే ఉన్నారు. బంగారు గణపతి విగ్రహంతో పాటు గుప్త నిధులు దొరికాయని స్థానికులు చెబుతున్నా..పోలీసుల నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. నిందితులతో పాటు ఓ కారును సీజ్‌ చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. నారాయణపూర్ జిల్లాకు చెందిన ఓ రైతుకు గుండాలలో పొలం ఉంది.. ఆ రైతు సమాచారం మేరకే అతడి పొలంలో తవ్వకాలు చేపట్టేందుకు హైదరాబాద్ నుంచి కొందరు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. పోలీసులు విచారణలో పూర్తి వివరాలు వెలుగుచూడనున్నాయి.

Also Read :

 Newly married woman suicide : “అమ్మా..! అతడే గుర్తొస్తున్నాడు”..అత్తారింట్లో నవవధువు ఆత్మహత్య

Wife beats husband : అపరకాళిగా మారిన ఆళి..భర్తను జెండా కర్రకు కట్టేసి కొట్టింది..ఎందుకో తెల్సా..?

New Coronavirus Strain in AP : ఏపీలో తొలి స్ట్రెయిన్ వైరస్ కేసు నమోదు..రాజమండ్రి వచ్చిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ

Molar Pregnancy : విచిత్రమైన ముత్యాల గర్భం…ప్రెగ్నంట్ అవుతారు..కానీ కడుపులో బిడ్డ ఉండదు

‘Master’ release date : ‘సంక్రాంతి బరిలోకి నేనూ వస్తున్నా’..రేస్‌లోకి దూసుకువచ్చిన ఇళయదళపతి విజయ్