చంద్రబాబుకు మరో ఝలక్.. గంటా రూటే సెపరేటు !

వరుస పెట్టి పార్టీని వీడుతున్న నేతలతో టిడిపి అధినేత చంద్రబాబు ఓవైపు సతమతమవుతుంటే.. మరో మాజీ మంత్రి ఆయనకు ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఏకంగా అధినేత చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలనే లైట్ తీసుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు టిడిపిని వీడడం ఖాయంగా కనిపిస్తోంది. గంటా శ్రీనివాస్ రావు.. ఉమ్మడి ఆంధ్ర్రపదేశ్ ఉన్నప్పటి నుంచి ఈయన పాలిటిక్సే సెపరేటు. ఒక్కోసారి ఓ సామాజిక వర్గానికే పరిమితమనిపించే ఈ నాయకుడు.. అప్పడప్పుడు అందరికీ ఆప్తుడనిపించుకుంటారు. అందుకే […]

చంద్రబాబుకు మరో ఝలక్.. గంటా రూటే సెపరేటు !
Rajesh Sharma

|

Nov 04, 2019 | 5:51 PM

వరుస పెట్టి పార్టీని వీడుతున్న నేతలతో టిడిపి అధినేత చంద్రబాబు ఓవైపు సతమతమవుతుంటే.. మరో మాజీ మంత్రి ఆయనకు ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఏకంగా అధినేత చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలనే లైట్ తీసుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు టిడిపిని వీడడం ఖాయంగా కనిపిస్తోంది.
గంటా శ్రీనివాస్ రావు.. ఉమ్మడి ఆంధ్ర్రపదేశ్ ఉన్నప్పటి నుంచి ఈయన పాలిటిక్సే సెపరేటు.
ఒక్కోసారి ఓ సామాజిక వర్గానికే పరిమితమనిపించే ఈ నాయకుడు.. అప్పడప్పుడు అందరికీ ఆప్తుడనిపించుకుంటారు. అందుకే చంద్రబాబు కోటరీలోను ఈజీగా ఇమిడిపోగలిగారు. గత ప్రభుత్వంలో అయిదేళ్ళు మంత్రి పదవిని అలంకరించి, చంద్రబాబుకు సన్నిహితుడనిపించుకున్నారు.
ఇదంతా బాగానే వున్నా.. ప్రభుత్వం మారిపోతే.. సొంత పార్టీ అధికారాన్ని కోల్పోతే.. ఇదే ఇప్పుడు గంటా రూటు మార్పునకు కారణమైనట్లుంది. గత కొన్ని రోజులుగా టిడిపికి దూరంగా.. అధినేతతో అంటీముట్టనట్లుంటున్న గంటా శ్రీనివాస్ రావు.. పార్టీ మారడమే తరువాయి అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
తాజాగా రాష్ట్రంలో ఇసుక కొరతకు ప్రభుత్వమే కారణమంటూ టిడిపి ఆందోళనలు నిర్వహిస్తుంటే.. గంటా శ్రీనివాస్ ఎక్కడా పాల్గొన్న దాఖలాలు లేవు. సాక్షాత్తు తన సొంత నగరంలో జనసేన పార్టీ నిర్వహించిన లాంగ్ మార్చ్‌కు మద్దతు ప్రకటించిన చంద్రబాబు.. ఈ కార్యక్రమానికి టిడిపి తరపున మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్ రావు, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు హాజరవుతారని ప్రకటించారు. అయితే ఆదివారం జరిగిన లాంగ్ మార్చ్‌కు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు హాజరు కాగా.. గంటా స్థానికంగా అంటే విశాఖ నగరంలో వుండి కూడా డుమ్మా కొ్ట్టారు.
సోమవారం కూడా గంటా శ్రీనివాస్ విశాఖలోనే వున్నట్లు ఆయన అనుచరులు చెబుతుండగా టిడిపి నేతలకు గానీ, చంద్రబాబు నాయుడుకు గానీ గంటా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ఈనేపథ్యంలో గంటా పార్టీ మారడం ఖాయమన్న సమాచారం వస్తుండగా.. ఏ పార్టీకి మారతారన్నది ఆసక్తికరంగా మారింది.
బిజెపి జాతీయ నాయకుడు రాంమాధవ్‌తో గంటా శ్రీనివాస్ రావు టచ్‌లో వున్నారని కొందరు చెబుతుండగా.. వల్లభనేని వంశీతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని మరికొందరు చెబుతున్నారు. ఈ క్రమంలో గంటా రాజకీయం రంజుగా మారింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu