“చిరంజీవి లేకపోతే…నేను సూసైడ్ చేసుకునేవాడిని”
టీవీ9 పొలిటికల్ ఎడిటర్ మురళికృష్ణ నిర్వహించే ఎన్‌కౌంటర్ విత్ మురళికృష్ణ కార్యక్రమానికి ఈ వారం ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత పృథ్వీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలను వెల్లడించారు. ఎస్వీబీసీ ఛానల్ మహిళా ఉద్యోగినితో మాట్లాడిన రాసలీలల ఫోన్ కాల్ ఫేక్ అని పేర్కొన్నారు. తనను ఛానల్ వాళ్లు చెప్పుతో కొట్టి బయటకు పంపించారని, పదవి కోసం తానెప్పుడూ ప్రాకులాడలేదని తెలిపారు. తాను రైతుల గురించి ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదని, కొందరు […]
టీవీ9 పొలిటికల్ ఎడిటర్ మురళికృష్ణ నిర్వహించే ఎన్‌కౌంటర్ విత్ మురళికృష్ణ కార్యక్రమానికి ఈ వారం ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత పృథ్వీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలను వెల్లడించారు. ఎస్వీబీసీ ఛానల్ మహిళా ఉద్యోగినితో మాట్లాడిన రాసలీలల ఫోన్ కాల్ ఫేక్ అని పేర్కొన్నారు. తనను ఛానల్ వాళ్లు చెప్పుతో కొట్టి బయటకు పంపించారని, పదవి కోసం తానెప్పుడూ ప్రాకులాడలేదని తెలిపారు. తాను రైతుల గురించి ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదని, కొందరు కావాలనే వాటిని వక్రీకరించారని పేర్కొన్నారు. తాను ఎదగడం పార్టీలో ఇష్టం లేక కొందరు కొన్ని అభియోగాాలు మోపారని, అవన్నీ భరించింది జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతోనే అని వెల్లడించారు. వెంకటేశ్వరస్వామి సాక్షిగా చెప్తున్నానన్న పృథ్వీ, తనను ఇబ్బంది పెట్టినవారు ఎవరూ బ్రతికిలేరని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు పృథ్వీ. చిరంజీవి గొప్ప వ్యక్తని, వివాదం జరిగిన తర్వాత తనకు అవకాశలివ్వమని చెప్పిన వ్యక్తి మెగాస్టార్ అని చెప్పుకొచ్చారు. పృథ్వీ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు, వేషాలు ఇచ్చి ఎంకరేజ్ చెయ్యమని చెప్పింది ఆయన ఒక్కరే అని ఎమోషనల్ అయ్యారు. ఆయన అలా చెయ్యకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో సూసైడ్ చేసుకునేవాడ్ని అంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.