AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అదిరింది’పై మౌనం ఎందుకంటూ.. నాగబాబుపై నెటిజన్స్ ఫైర్

'అదిరింది'పై మౌనం ఎందుకంటూ.. నాగబాబుపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. జబర్దస్త్‌లో నవ్వుతూ.. చక్రం తిప్పిన.. నాగబాబు.. కొన్ని కారణాలతో ఆ షో నుంచి ఔట్ అయ్యారు. అప్పట్లో ఈ వార్త సంచలనాలకు దారి..

'అదిరింది'పై మౌనం ఎందుకంటూ.. నాగబాబుపై నెటిజన్స్ ఫైర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 08, 2020 | 9:03 PM

Share

‘అదిరింది’పై మౌనం ఎందుకంటూ.. నాగబాబుపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. జబర్దస్త్‌లో నవ్వుతూ.. చక్రం తిప్పిన.. నాగబాబు.. కొన్ని కారణాలతో ఆ షో నుంచి ఔట్ అయ్యారు. అప్పట్లో ఈ వార్త సంచలనాలకు దారి తీసింది. వెళ్తూ వెళ్తూనే ఆయన పలు విమర్శలు కూడా చేశారు. జబర్దస్త్ అంటే.. నవ్వుల నవాబ్ నాగబాబే ప్రత్యేక ఆకర్షణ. స్కిట్ల మధ్యలో నాగబాబు వేసే పంచ్‌లకి జనాలు బాగా కనెక్టయ్యారు. అయితే జబర్దస్త్‌ను నితిన్-భరత్‌లు డైరెక్ట్ చేసేవారు. ఇటీవల ఆర్గనైజింగ్ సంస్థతో విభేదాలు రావడంతో.. వారు తప్పుకున్నారు. సదరు డైరెక్టర్లతో మంచి సాన్నిహిత్యం ఉన్న నాగబాబు కూడా.. హర్ట్ అయ్యి వెళ్లిపోయారు.

జబర్దస్త్‌లో క్రియేటీవ్ డిఫెరన్స్ వల్లే బయటకు వచ్చానని, అక్కడంతా కార్పొరేట్ స్టైల్‌ అని, ఆర్టిస్ట్‌లకు ఏమైనా సరే వారు పట్టించుకోరంటూ.. తీవ్ర విమర్శలు చేశారు నాగబాబు. అలాగే జబర్దస్త్ కమెడియన్స్‌ను చెప్పకుండా తీసేశారని, అయితే అలా ఎలా తీసేస్తారని ఆరోపణలు చేశారు. ఇదే ప్రధాన ఆరోపణగా కూడా చెప్పుకొచ్చారు. చెప్పాపెట్టకుండా కొందరు కమెడియన్స్‌ని తీసేశారనీ. కానీ ఇప్పుడు నాగబాబు కూడా అదే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

అదిరింది షో యాంకర్‌గా సమీరాను 26 ఎపిసోడ్స్‌ కోసం సైన్ చేసుకున్నారట. కానీ మధ్యలో ఏమైందో ఏమో కానీ.. 10 ఎపిసోడ్స్ కాగానే ఆమెను తొలగించారు. కనీసం ఈ విషయాన్ని ఆమెకు కూడా చెప్పలేదట. ఇదే విషయంలో నాగబాబు ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. చెప్పకుండా ఆర్టిస్ట్‌లను తీశారంటూ జబర్దస్త్‌పై విమర్శలు చేసిన నాగబాబు.. అదిరిందిపై మరి మౌనమెందుకు వహిస్తున్నారంటూ.. నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. అగ్రిమెంట్ రాసుకున్నా కూడా అలా మధ్యలోనే ఎలా తీస్తారు? ఈ విషయంపై ఎందుకు ప్రశ్నించడం లేదంటూ నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు.. వీలునామా రద్దు చేయించిన తమ్ముడు! కారణమేంటంటే?

ఇది కూడా చదవండి: అసలు టార్గెట్ దొరబాబు కాదట.. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే!

Read More: 30 ఏళ్ల తర్వాత కూడా.. ‘కర్తవ్యం’కు అరుదైన గుర్తింపు.. ఆనందంలో విజయ శాంతి

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత