ఆయన్ని కొడితే రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ.. ఆనందంలో రోజా!
ఏపీఐఐసీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ పరంగా ఆమె ఫైర్ బ్రాండ్. అలాగే.. జబర్దస్త్‌లోనూ 8 ఏళ్లుగా జడ్జిగా వ్యవహరిస్తూ..
ఏపీఐఐసీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ పరంగా ఆమె ఫైర్ బ్రాండ్. అలాగే.. జబర్దస్త్‌లోనూ 8 ఏళ్లుగా జడ్జిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే.. అప్పట్లో ఏపీలో కేబినెట్ విస్తరణలో భాగంగా.. ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి తప్పకుండా వస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ.. ఆ లిస్ట్‌లో ఆమె పేరు లేదు. దీంతో రోజా ఫ్యాన్స్ అప్‌సెట్ అయ్యారు. అయితే మరి రోజాకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది? దీనికి సమాధానం కేవలం ఒక్కరి దగ్గరే ఉంది. అది ఎవరో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అయితే.. రోజా మంత్రి పదవిపై అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు ఆమె జడ్జిగా వ్యవహరించే జబర్దస్త్ కామెడీ రియాల్టీ షోలో కూడా అప్పుడప్పుడు పలు జోక్స్ పేలుతూ ఉంటాయి. తాజాగా మరోసారి రోజా మంత్రి పదవిపై జోక్స్ వేశారు. ఈ వారం జబర్దస్త్ ప్రోమోను చూస్తే.. ‘స్కిట్‌లో భాగంగా.. శాంతి స్వరూప్ ఎవరితోనైనా.. కొట్టించుకుంటేనే.. సెంటిమెంట్ వర్క్‌వుట్ అవుతుందన్నమాట.
ఈ నేపథ్యంలో గెటప్ శ్రీనుతో తన్నులు తింటాడు. ఆ తర్వాత గెస్ట్‌గా వచ్చిన విష్వక్సేన్‌ను కొట్టమని బతిమలాడతాడు. ఆ తర్వాత రోజా వద్దకు వెళ్లి తనను కొట్టాలని కోరాడు. ఆ సమయంలో.. ఫసక్ శశి.. రోజా దగ్గరకు వెళ్లి ‘మేడమ్ మీరు ఆయన్ని కొడితే మినిస్టర్ పదవి గ్యారెంటీ’ అని చెబుతాడు. దీంతో.. రోజా ఆనందంతో.. కర్ర తీసుకుని శాంతి స్వరూప్‌ని చితకబాదడం’ చూస్తే… కడుపుబ్బా నవ్వాల్సిందే.
ఇది కూడా చదవండి: ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు.. వీలునామా రద్దు చేయించిన తమ్ముడు! కారణమేంటంటే?
ఇది కూడా చదవండి: అసలు టార్గెట్ దొరబాబు కాదట.. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే!
Read More: 30 ఏళ్ల తర్వాత కూడా.. ‘కర్తవ్యం’కు అరుదైన గుర్తింపు.. ఆనందంలో విజయ శాంతి