12 ఏళ్ల కెరీర్..స్క్రాప్ నుంచి సౌత్ ఇండియా స్టార్..
కెజిఎఫ్ - చాప్టర్1 సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ హీరో యశ్ తొలి చిత్రం 'మొగ్గిన మనసు' విడుదలయి ఈ జులై 18కి పన్నెండేళ్ళు పూర్తయింది.
కెజిఎఫ్ – చాప్టర్1 సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ హీరో యశ్ తొలి చిత్రం ‘మొగ్గిన మనసు’ విడుదలయి ఈ జులై 18కి పన్నెండేళ్ళు పూర్తయింది. ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే – యశ్ శ్రీమతి రాధికా పండిట్ కూడా ఈ సినిమాతోనే పరిచయమయ్యారు.
2008లో విడుదలయిన మొగ్గిన మనసు సినిమా రొమాంటిక్ డ్రామా. యశ్, రాధికా పండిట్ కలిసి నటించిన ఈ సినిమాకి శశాంక్ దర్శకుడు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కావడంతో పాటు మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత యశ్ మొదల సాల, రాజధాని, కిరాతక, డ్రామా, గజకేసరి, గూగ్లీ, రాజాహులి సినిమాలతో పాపులర్ అయ్యారు. మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో కూడా రాధికా పండిట్ హీరోయిన్ కావడం విశేషం. ఆ తర్వాత కెజిఎఫ్ చాప్టర్1 సినిమాతో ఆలిండియా స్టార్ అయ్యారు. కెజిఎఫ్ చాప్టర్2 సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మొగ్గిన మనసు సినిమా లో యష్ శ్రీ మతి రాధికా పండిట్ హీరోయిన్ గా నటించారు . ఇదే రాధికా పండిట్ తోలి సినిమా . ఆ తర్వాత వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు . ఈ సందర్భంగా యష్ మాట్లాడుతూ ” ఈ ప్రత్యేకమైన రోజు ని ఎప్పటి కి మర్చిపోలేనని . ఒక స్క్రాప్ నుంచి తారాస్థాయికి వచ్చానని యష్ అన్నారు. అలాగే కెజిఎఫ్ చాప్టర్ -2 షూటింగ్ కొంత బ్యాలెన్స్ వర్క్ వుందని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తానని అన్నారు.