కరోనా లాక్‌డౌన్: దేశవ్యాప్తంగా తగ్గిన కాలుష్యం..!

ఓ వైపు కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు ప్రధానమంత్రి పిలుపు మేరకు మార్చి 23వ తేదీ నుంచి భారతదేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రైలు, విమానాలతో పాటు ఇతర వాహనాల వాడకం కూడా తగ్గిపోయింది. అంతేకాక, ఎన్నో పరిశ్రమలు మూతబడ్డాయి. ఈ కారణంగా దేశ వ్యాప్తంగా కాలుష్యం శాతం కూడా తగ్గిపోయింది. కోవిద్ 19 ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాలకు […]

కరోనా లాక్‌డౌన్: దేశవ్యాప్తంగా తగ్గిన కాలుష్యం..!
Follow us

| Edited By:

Updated on: Apr 08, 2020 | 8:26 PM

ఓ వైపు కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు ప్రధానమంత్రి పిలుపు మేరకు మార్చి 23వ తేదీ నుంచి భారతదేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రైలు, విమానాలతో పాటు ఇతర వాహనాల వాడకం కూడా తగ్గిపోయింది. అంతేకాక, ఎన్నో పరిశ్రమలు మూతబడ్డాయి. ఈ కారణంగా దేశ వ్యాప్తంగా కాలుష్యం శాతం కూడా తగ్గిపోయింది.

కోవిద్ 19 ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. గత ఏడాది(2019) ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 20 అత్యంత కలుషిత నగరాల్లో 14 నగరాలు భారతదేశానికి చెందినవే. అయితే ఏప్రిల్ 7వ తేదీన వచ్చిన నివేదిక ప్రకారం.. ఈ సంఖ్య కేవలం రెండుకు పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ముంబై, కోల్‌కతా మాత్రమే అత్యంత కలుషిత నగరాలుగా నిలిచాయి. అయితే లాక్‌డౌన్ అమలు ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపించినా.. కాలుష్యాన్ని మనం అదుపు చేయవచ్చనే విషయాన్ని రుజువు చేసిందని పర్యావరణ వేత్తలు అంటున్నారు.

కాగా.. కేంద్ర కాలుష్య నివారణ శాఖ పర్యవేక్షిస్తున్న 103 నగరాల్లో లాక్‌డౌన్ సమయంలో 90శాతం కాలుష్యం తగ్గినట్లు నిర్ధారణ జరిగింది. గాలిలో కాలుష్య శాతం తగ్గడం వల్ల నిమోనియా వంటి వ్యాధులు సోకే అవకాశాలు తగ్గుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతీ ఏడా దాదాపు ఏడు మిలియన్ల మంది కలుషిత గాలి పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. దీంతో ఆర్థిక వ్యవస్థకంటే కూడా కలుష్యాన్ని తగ్గించడం ఎంతో ముఖ్యమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

Latest Articles
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో