అద్దె గర్బాలతో కుటుంబాలని పోషించుకుంటున్న హైదరాబాద్ మహిళలు..!
మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని సంక్షోభంలోకి నెట్టింది. అన్ని రంగాలపై దీని ప్రభావం ఉంది. ముఖ్యంగా భారీ సంఖ్యలో జనాలు ఉపాధి కొల్పోయారు. ప్రైవేట్ ఉద్యోగులు అయితే సంక్షోభంలోకి నెట్టబడ్డారు.

మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని సంక్షోభంలోకి నెట్టింది. అన్ని రంగాలపై దీని ప్రభావం ఉంది. ముఖ్యంగా భారీ సంఖ్యలో జనాలు ఉపాధి కొల్పోయారు. ప్రైవేట్ ఉద్యోగులు అయితే సంక్షోభంలోకి నెట్టబడ్డారు. కొన్ని సంస్ధలు ఉద్యోగులకు ఉద్వాసన పలికేస్తుండగా, మరికొన్ని సంస్థలు ఉద్యోగుల భారాన్ని తగ్గించుకునేందుకు పొమ్మనలేక పొగ పెడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సగం జీతాలు ఇస్తూ, పని ఒత్తిడి పెంచుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. అసలే లాక్ డౌన్…పైగా కుటుంబ ఖర్చులు, అద్దెలు, లోన్ పేమెంట్స్, ఈఎంఐలు, పిల్లలు..పెద్దల బాగోగులు..ఒక్కటేమిటి సామాన్యుడి మెడకి కరోనా వైరస్ గుదిబండలా మారింది. ఈ క్రమంలోనే ఇళ్లు గడవని హైదరాబాద్ మహిళలు సంపాదన కోసం ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో అద్దె గర్భం దాల్చడం, అండాలను దానం చేయడం లాంటి పనులు చేస్తున్నారు. మొన్నటి వరకూ సక్రమంగానే గడిచిన జీవితాలు ఇప్పుడు దారి తప్పడంతో..ఉద్యోగాలు కొల్పోయిన 25-35 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు సరోగేట్ మదర్‌గా మారడానికి రెడీ అవుతున్నారు. సరోగేట్ మదర్‌కు రూ. 5 లక్షల వరకు పే చేస్తుండగా.. అండం దానం చేసే వారికి రూ. లక్ష ఇస్తున్నారు.
నార్త్ నుంచి వచ్చిన 25 ఏళ్ల మీరా అనే యువతి ఏడాది క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఉద్యోగంలో చేరింది. ఆమెకు ప్రతినెలా రూ.45 వేలు శాలరీ వచ్చేది. కానీ లాక్‌డౌన్ కారణంగా ఆమె శాలరీలో గండి పడింది. వయస్సు మీదపడిన తల్లిదండ్రులు ఓవైపు.. ఈఎంఐలు కట్టాలంటూ బ్యాంకు ఒత్తిళ్లు మరోవైపు.. దీంతో ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు. దీంతో సరోగేట్ మదర్‌గా మారాలని డిసైడయ్యింది. ఇలా చెయ్యడం ద్వారా వచ్చే డబ్బుతో మరో సంవత్సరం పాటు కుటుంబాన్ని పోషించుకుంటానని ఆమె చెప్తుంది. గతంలో పేద మహిళలు సరేగేట్ మదర్‌గా మారడానికి ముందుకు రాగా.. ఇప్పుడు చదుకుని మంచి, మంచి జాబ్స్ చేసిన యువతులు ముందుకొస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
