బాలీవుడ్‌పై విలన్ కీలక వ్యాఖ్యలు
విలన్‌గా మంచి పేరును సాధించుకున్న రాహుల్ దేవ్.. తెలుగు, తమిళం, హిందీ, పంజాబీ బాషల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఈ నటుడు సినీ ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి అవుతోంది

విలన్‌గా మంచి పేరును సాధించుకున్న రాహుల్ దేవ్.. తెలుగు, తమిళం, హిందీ, పంజాబీ బాషల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఈ నటుడు సినీ ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయన పంచుకున్నారు.
”దాస్ చిత్రంలో ముకుల్ ఆనంద్ మొదటిసారిగా నాకు అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఇంతవరకు నేను ఎప్పుడు వెనక్కి తిరిగా చూడలేదు. ఈ ఇండస్ట్రీలో కెరీర్ అన్నది అదృష్టం, టాలెంట్, హార్డ్ వర్క్ మీదనే ఆధారపడి ఉంటుంది. చివరకు సినీ పరిశ్రమ అన్నది బిజినెస్‌గానే ఉంటుంది అని అన్నారు. ఇక తన భార్య అనారోగ్యానికి గురవ్వడంతో నాలుగేళ్ల పాటు ఈ నటుడు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
దానిపై మాట్లాడుతూ.. ”గాడ్ ఫాదర్ లేకుండా బ్రేక్‌ను తెచ్చుకోలేని ఈ ఇండస్ట్రీలో నాలుగేళ్ల తరువాత కూడా నేను అవకాశాలు దక్కించుకోగలిగాను. కారెక్టర్ ఆర్టిస్ట్‌గా నా కోసం మాత్రమే నేను నటించాలనుకుంటాను. బాలీవుడ్‌లో మనకు ఎవరూ సాయం చేయరు. నువ్వు పని బాగా చేయగలవు అనిపిస్తేనే నీకు ఇక్కడ పని ఇస్తారు” అని ఆయన అన్నారు.