పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. లంబసింగికి పెరుగుతున్న పర్యాటకులు.. అరకులోయలో 11.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత

విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. మినుములూరులో సోమవారం ఈ సీజన్‌లోనే అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక్కడి కాఫీ బోర్డులో ఆదివారం 12 డిగ్రీలు నమోదు కాగా సోమవారానికి 8 డిగ్రీలకు పడిపోయింది.

  • Sanjay Kasula
  • Publish Date - 5:48 am, Tue, 8 December 20
పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. లంబసింగికి పెరుగుతున్న పర్యాటకులు.. అరకులోయలో 11.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత

తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడింది. ఇది ఆగ్నేయ ఆరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో దానికి అనుకుని అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. మినుములూరులో సోమవారం ఈ సీజన్‌లోనే అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక్కడి కాఫీ బోర్డులో ఆదివారం 12 డిగ్రీలు నమోదు కాగా సోమవారానికి 8 డిగ్రీలకు పడిపోయింది.

ఇక అరకులోయలో 12.7 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానంలో 11.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లంబసింగికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఏజెన్సీలో ఉదయం 9.30 గంటల వరకు మంచు కురుస్తోంది.