కాంగ్రెస్‌ నేత విజయశాంతి బీజేపీలో చేరిపోయారు..రాములమ్మను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా

కాంగ్రెస్‌ నేత విజయశాంతి బీజేపీలో చేరిపోయారు. ఇటీవల అమిత్‌షాను కలిసిన ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారాయన. నిన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని...

కాంగ్రెస్‌ నేత విజయశాంతి బీజేపీలో చేరిపోయారు..రాములమ్మను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా
Follow us

|

Updated on: Dec 08, 2020 | 5:18 AM

కాంగ్రెస్‌ నేత విజయశాంతి బీజేపీలో చేరిపోయారు. ఇటీవల అమిత్‌షాను కలిసిన ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారాయన. నిన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తానన్నారు రాములమ్మ.

నడ్డా సమక్షంలో బీజేపీలోకి విజయశాంతి ఎంట్రీ ఇచ్చారు. ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. నిన్న బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు విజయశాంతి. ఆమెను పార్టీలోకి ఆహ్వానించారాయన. ఈరోజు నడ్డాను కలిసి అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

పార్టీలో చేరిన సమయంలో ఆమెతోపాటు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌, బీజేపీ బీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర నేతలు వివేక్‌ వెంకటస్వామి, ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందే ఆమె చేరుతారని అంతా భావించినా.. ఎన్నికల హడావుడిలో లేట్‌ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రాంతీయ నేతలను ఆకర్షించేపనిలో పడింది.

ఈ నేపథ్యంలోనే విజయశాంతి పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై తనకు అపారమైన నమ్మకం ఉందన్నారు విజయశాంతి. ఆయనవల్లే అభివృద్ధి సాధ్యమన్నారామె. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ వచ్చి తీరుతుందన్నారు. విజయశాంతి తర్వాత ఇంకొంతమంది కీలక నేతలు పార్టీలోకి వస్తారన్నారు బండి సంజయ్‌.